ప్రభుత్వ టీచర్ల ప్రతిష్టకు    భంగంకలిగిస్తున్న విద్యా కమిషన్

ఉపాధ్యాయుల సమస్య లు ప్రస్తావించని కమిషన్ కు టీచర్ల జీతాల సంగతి ఎందుకు..?

ప్రభుత్వ టీచర్ల ప్రతిష్టకు    భంగంకలిగిస్తున్న విద్యా కమిషన్

పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు వై. జనార్దన్ రెడ్డి .

నారాయణపేట ఫిబ్రవరి 27:
తెలంగాణ విద్యా కమిషన్ ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదికలో  కమిషన్ పరిధిలో లేని ఉపాధ్యాయుల జీతాల గురించి ప్రస్తావించడం  విడ్డూ రమని,ఉపాధ్యాయులకు రెండు మూడు సంవత్సరా లుగా పెండింగ్ బిల్లులు రావ డంలేదని ఉపాధ్యాయుల సమస్యలు ప్రస్తా వించని కమిషన్ జీతాల గురించి ప్రస్తావించడంఉపాధ్యాయుల ప్రతిష్టకు భంగం కలిగించడ మేనని నారాయణపేట జిల్లా పిఆర్ టి యు టి ఎస్ అధ్యక్షులు వై. జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. వెంకట్ రెడ్డి ఒక ప్రకటన లో పేర్కొ న్నారు.పేదవాళ్లను ప్రభుత్వ విద్యకు దూరం చేసే చాలా విషయాలు ఈ నివేదిక లో ఉన్నాయని సమగ్రమైన అధ్య యనం చేయకుండా మండ లానికి రెండు మూడు స్కూళ్లు మాత్రమే ఉండాలని పేర్కొన డం శోచనీయమని అన్నారు. ఉపాధ్యాయుల అర్హతల విషయంలో కూడా సాంకేతిక సంస్థలు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చిన సిఫారసులు చేయడం జరిగిందని తెలి పారు.ప్రభుత్వ పాఠశాలలను కుదించడం పేదవాళ్లకు ప్రభు త్వ విద్యను దూరం చేయడ మేనని, వందల మంది విద్యా ర్థులను ఒకే చోట ఉంచడం వలన మధ్యాహ్న భోజ నం ,టాయిలెట్స్ వినియోగం లో  పారిశుద్ధ్య సమస్యలు, విద్యార్థులపై ఏకాగ్రత ఉంచ డం మొదలగు సమస్యలు ఏర్పడతాయని అన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి విద్యా కమిషన్ సిఫారసుల ను పునః సమీక్షించాలని పి ఆర్ టి యు నాయకులు ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.

_____________________

Tags:

About The Author

Latest News

ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
    లోకల్ గైడ్:  చౌదరిగూడ జిల్లేడు చౌదరిగూడ మండలం,  ఎలుకగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ శుభ్రత మరియు
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ళ
మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్