ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం

గ్రామ శుభ్రత, పచ్చదనం కోసం మొక్కలకు నీరు –  ముళ్ల పొదలు తొలగింపు

ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం

IMG-20260314-WA0020   లోకల్ గైడ్:  చౌదరిగూడ

జిల్లేడు చౌదరిగూడ మండలం,  ఎలుకగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ శుభ్రత మరియు పచ్చదనం పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చాకలి బందయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో కలియ తిరుగుతూ చెట్లకు పాదులు తీయడం, మొక్కలకు నీరు పట్టడం, మొక్కల చుట్టూ ఉన్న చెత్తను తొలగించడం వంటి పనులు చేపట్టారు. అలాగే గ్రామ లో ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను .రోడులకు ఎరుపక్కల గడ్డిని తొలగించారు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ అభివృద్ధిలో మహిళలు ముందుండాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలో పచ్చదనం మరియు పరిశుభ్రత ఎక్కువగా ఉంటే ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.
సర్పంచ్ చాకలి బందయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ సహకారం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి వార్డు సభ్యుడు తమ వార్డులో సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాను కూడా స్వయంగా గ్రామంలో శుభ్రత పనుల్లో పాల్గొని చెట్లకు నీరు పట్టడం వంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటానని తెలిపారు.
గ్రామ సెక్రటరీ మాట్లాడుతూ గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, పరిశుభ్రత, పచ్చదనం పరిరక్షణ వంటి కార్యక్రమాలను ఎంపీడీవో ఆదేశాల మేరకు సర్పంచ్ సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో, ,షాద్‌నగర్ మార్కెట్ డైరెక్టర్రోడులకు ఎరుపక్కల గడ్డిని వెంకటనర్సింహారెడ్డి , , ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, యువకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం ఎలుకగూడెంలో ప్రజాపాలన 99 రోజుల ప్రణాళిక కార్యక్రమం
    లోకల్ గైడ్:  చౌదరిగూడ జిల్లేడు చౌదరిగూడ మండలం,  ఎలుకగూడెం గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామ శుభ్రత మరియు
మున్సిపాలిటీ కో-ఆప్షన్ రేసులో బండారు మహేష్?
అశ్వారావుపేటలో ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు?
నూతన వధువరులకు శుభాకాంక్షలు 
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి..
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇందిరమ్మ ఇళ్ళ
మార్చి 28న సిద్దిపేటలో జాతీయ లోక్ అదాలత్