మాదకద్రవ్యాల అనర్థాలపై అవగాహన కల్పించాలి
జిల్లా అదనపు కలెక్టర్ శ్రీను.
నారాయణపేట ఫిబ్రవరి 27:
మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగా హన కల్పించి, నారాయ ణపేట జిల్లాలో మాదకద్రవ్యా ల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సంబంధిత అధికారు లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని విసి హాల్ లో మాదకద్రవ్యాల నిషేధం(యాంటీ నార్కోటిక్)పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందని మన జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా రైతు తన పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు రుజువు అయితే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పరంగా లబ్ది చేకూరే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయడం జరుగు తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో యాoటీ డ్రగ్ కమిటీల నేతృత్వంలో మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. మన జిల్లాలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ,జూనియర్ జూనియర్ కళాశాలలోనే కాకుండా పాఠశాలలలోనూ మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిల్లాలో గంజాయి సరఫరాపై పోలీసు ,ఎక్సైజ్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులే కాకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నిషేధాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని ఆయన సూచించారు. జిల్లాలో జరిగే ప్రతీ కార్యక్రమంలో మాదక ద్రవ్యాల నిషేధ అంశాన్ని ఒక సబ్జెక్టు గా పెట్టుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ అబ్దుల్ ఖలీల్, డీపీ ఆర్ వో రషీద్, సీఐ శివశంకర్, వైద్య శాఖ అధికారి బిక్షపతి, కలెక్టరేట్ సీ సెక్షన్ అధికారిని జయసుధ, ఎక్సైజ్ సి.ఐ. ఎస్.ఐ, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:7.సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్
----------------------------------------
