న్యూస్ స్కూలులో వైభవంగా వసంత పంచమి. -- గంట్ల అనంతరెడ్డి చైర్మన్.
పాఠశాలలో చదువుల తల్లి, జ్ఞాన ప్రదాత అయిన సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపాల్ తిరుమల్ రెడ్డి .
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .జనవరి 23. (లోకల్ గైడ్ తెలంగాణ).
నల్గొండ పట్టణం వివేకానంద నగర్ న్యూస్ పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. చిన్నారుల అభ్యాసాలతో పాఠశాలలో చదువుల తల్లి, జ్ఞాన ప్రదాత అయిన సరస్వతీ దేవి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపాల్ తిరుమల్ రెడ్డి అధ్యక్షతన న్యూస్ పాఠశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ పవిత్రమైన రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు బాగా అబ్బుతాయని విద్యార్థుల తల్లిదండ్రుల, టీచర్ల దృష్టిలో ఉంచుకుని, తమ చిన్నారులతో పెద్ద సంఖ్యలో పాఠశాలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు.భక్తిశ్రద్ధలతో 'ఓం'కారం..ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ చిన్నారులకు అక్షరాభ్యాసం టీచర్లు పిల్లల చేతులు పట్టుకుని పలకపైన, బియ్యంలోనూ ‘ఓం’కారాన్ని దిద్దించి వారి విద్యాజీవితానికి నాంది పలికారు. చిన్నారుల కిలకిలారావాలతో, పాఠశాల భక్తి దైవంతో కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో తిరుమల్ రెడ్డి, స్పందన, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది
విద్యార్థులు, తల్లిదండ్రులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
