ఆడపిల్లల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల గోడ ప్రతులను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్.

ఆడపిల్లల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి.

ఖమ్మం :లోకల్ గైడ్:
ఆడపిల్లల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్  పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. *అదనపు కలెక్టర్ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో కలిసి మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల గోడ ప్రతులను ఆవిష్కరించారు.*
ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* జిల్లాలో 7 మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వీటిలో 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య మైనారిటీలకు అందించడం జరుగుతుందని అన్నారు. *ఖమ్మంలోని మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదివిన 38 మంది విద్యార్థులకు ఐఐటీ సీట్లు, 39 మంది ఎంబీబీఎస్, 11 మంది సీఏ, 14 మంది లా సెట్ క్రాక్ చేశారని తెలిపారు.* మైనారిటీ జీవితాలలో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం మైనారిటీ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిందని అన్నారు.  *మనం బాగుపడాలంటే చదువు చాలా కీలకమని అన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ప్రభుత్వ ఉపాధిలో మహిళలు బాగా రాణిస్తున్నారని అన్నారు.* ముస్లిం వర్గాలలో బాలికల విద్యను ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలో సీట్లను పూర్తి స్థాయిలో భర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మహమ్మద్ ముజాహిద్, సిఐ రామకృష్ణ, రీజినల్ లెవెల్ కో ఆర్డినేటర్ ఎంజె అరుణకుమారి, ముస్లిం మత పెద్దలు, మస్జిద్ కమిటీ సదర్లు ( ప్రెసిడెంటు / సెక్రటరీ ), మైనారిటీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య