కోటిలింగాల జాతరకు సర్వం సిద్ధం.

మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కోటిలింగాల జాతరకు సర్వం సిద్ధం.

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 14 :

సింగరేణి మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ కోటిలింగాల దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా సర్పంచ్ హేమలత బాలాజీ, మండల పంచాయతీ అధికారి మల్లెల రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాతర ప్రాంగణంలో పారిశుద్ధ్య పనుల కోసం ఆరు బృందాలను నియమించినట్లు వెల్లడించారు.
అలాగే వివిధ శాఖల సమన్వయంతో స్వామివారి దర్శనం సాఫీగా జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, విద్యుత్‌, రవాణా తదితర సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలం వెంకటేశ్వర్లు, భాగ్యనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ హిరాలాల్, గ్రామపంచాయతీ కార్యదర్శులు అనిల్, నెహ్రూ, నిరంజన్ కుమార్, సంతోష్ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాలతో  కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాలతో 
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్...
విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి.
మార్చి 1న కరీంనగర్‌ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ప్రవేశ పరీక్ష.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు  అధ్యక్షులు దోసకాయల వెంకటేశం
హనుమంతుడు భక్తి,బలం, ధైర్యం మరియు నిస్వార్థ సేవకు ప్రతీక
బూర్గుల సంత ప్రారంభోత్సవానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ కు ఆహ్వానం.
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర.