బీరంగూడలో నూతన ‘సిల్వర్ బావర్చి’ రెస్టారెంట్ ప్రారంభం

బీరంగూడలో నూతన ‘సిల్వర్ బావర్చి’ రెస్టారెంట్ ప్రారంభం

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

అమీన్పూర్ మండలం బీరంగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన సిల్వర్ బావర్చి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పఠాన్ చేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారితో పాటు అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బీరంగూడ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇలాంటి ఆధునిక వసతులతో కూడిన రెస్టారెంట్లు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. ఎమ్మెల్సీ అంజి రెడ్డి మాట్లాడుతూ..నాణ్యమైన ఆహారంతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని ఈ మూడో బ్రాంచి “మూడు పువ్వులు ఆరు కాయలుగా” అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి మాట్లాడుతూ..వ్యాపార రంగంలో ముందుకు వస్తున్న యువ పారిశ్రామిక వేత్తలకు ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. నూతనంగా ప్రారంభమైన ఈ రెస్టారెంట్  ప్రాంత ప్రజలకు రుచికరమైన శుభ్రమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రారంభించబడింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, సిల్వర్ బావర్చి నిర్వాహకులు, సిబ్బంది, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News