ప్రభుత్వం గుర్తించే వరకు శివపార్వతుల కళ్యాణం జరిపిస్తాము

సోమన్న సన్నిధిలో శివపార్వతుల కల్యాణం చూతుము రండి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్న శివయ్య భక్తులు

ప్రభుత్వం గుర్తించే వరకు శివపార్వతుల కళ్యాణం జరిపిస్తాము

స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న మూడు తండా  యువత

భద్రాద్రి జిల్లా, జూలూరుపాడు : లోకల్ గైడ్ :

 జూలూరుపాడు మండలం బేతాళ పాడు పంచాయతీ లో మూడు తండా లకు అతి సమీపం లో ఉన్న సోమన్న ఆలయ సన్నిధి (సోమన్న గుట్ట) లో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించుటకు మూడు తండాల యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కళ్యాణం జరిపించుటకు పనులు శరవేగంగా పూర్తి చేశారు. అక్కడక్కడ కొన్ని అనివార్య కారణాలవల్ల కొందరు కళ్యాణ పనులకు దూరంగా ఉండవలసి వచ్చిన, శివపార్వతుల కళ్యాణం జరిపిస్తాం అని బేతాళ పాడు గ్రామ పంచాయతీ పీక్ల తండా పంతులు తండా టాఖ్య తండ మూడు తండాల యువత వారం రోజులు శ్రమించి శివ పార్వతి ల కళ్యాణం పనులు పూర్తి చేశారు. కళ్యాణ మహోత్సవం వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు భక్తులకు అసంఘటిత సమస్యలు లేవనెత్తకుండా సకల సౌకర్యాలతో కళ్యాణ మండపం ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటల 30 నిమిషాలకు స్వామివారి కల్యాణం వేడుకలు జరుగుతాయి తెల్లవారి ఉదయం నుండి స్వామివారి దర్శనం అనంతరం స్వామి వారి నైవేద్య  తీర్థ ప్రసాదాల తో స్వామివారి ఆశీస్సులు కు  అందుకొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని స్వచ్ఛందంగా ఆలయ కళ్యాణ పనులు చేస్తున్న శివ భక్తులు వివరిస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కొత్తగూడెం సుజాతనగర్ జూలూరుపాడు మండల ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొని జయప్రదం చేయగలరు.  సోమన్న ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని , ప్రభుత్వం నుండి గుర్తింపు వచ్చిన రాకపోయినా  ప్రభుత్వ అధికారులు చొరవ చూపి కనీస సౌకర్యాలు అయినటువంటి  బోరు బావి ద్వారా మంచినీటి సదుపాయం తో పాటు కరెంటు సదుపాయం మంజూరు చేయాలని గ్రామ ప్రజలు కోరారు. గ్రామ పంచాయతీ ప్రజలకు పెద్ద మనసుపెట్టి ప్రతి ఒక్క మనిషి ఆర్థికంగా అభివృద్ధి పొంది ప్రతి ఒక్క శివ భక్తులు ఆలోచించి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని శివపార్వతుల కళ్యాణ నిర్వహణ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News