పి ఎం ధన ధాన్య యోజనతో రైతులు లబ్ధి చేకూర్చాలి

ఆయ సీడ్స్ పరిశోధన డైరెక్టర్ పొన్ను స్వామి.

పి ఎం ధన ధాన్య యోజనతో రైతులు లబ్ధి చేకూర్చాలి

నారాయణపేట ఫిబ్రవరి 19:

రైతు ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి న పి ఎం ధన ధాన్య యోజన తో రైతులకు లబ్ది చేకూర్చా లని ఆ పథకం ప్రత్యేక అధికా రి డాక్టర్ పొన్ను స్వామి అధికారులకు సూచించా రు.ఈ పథకంపై  ప్రత్యేక అధికారి  భారత ప్రభుత్వ ఆయిల్‌సీడ్స్ పరిశోధన డైరెక్టర్‌ డా. పొన్నుస్వామి గురువారం నారాయణపేట జిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎండీడీకే వై  పథకం అమలు పురోగతిని సమగ్రంగా పరిశీలించారు. జిల్లా స్థాయి అధికారులు పథకం అమలుపై వివరాలను శాఖల వారీగా నివేదించగా డా. పొన్నుస్వామి కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచన లు చేశారు. పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను శాఖల వారీగా పంపించాలని ఆదేశించారు. ఆ పథకం పరిధిలోని వ్యవసాయ, మత్స్య, పాడి పరిశ్రమ, కో-ఆపరేటివ్, గ్రామీణాభి వృద్ధి, ఉద్యాన శాఖల అధికారులతో  సుదీర్ఘంగా చర్చించి, అమలు కు అవ సరమైన సలహాలు ఇచ్చారు.  అంతకు ముందు డా.పొన్ను స్వామి మరికల్ మండలం లోని కూరగాయలు, ఆయిల్ పామ్, మొక్క జొన్న పంట పొలాలను సందర్శించి, రైతు లతో ప్రత్యక్షంగా మాట్లాడా రు. పంటల స్థితిగతులు, సాగు పద్ధతులు, ఉత్పాద కత, ఎదురవుతున్న సమ స్యలు వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలు తెలుసుకుని, అధికారులతో చర్చించి సూచనలు అందించారు. పథకం అమలు పై జిల్లా అధికారులు, రైతుల నుంచి అభిప్రాయాలు, సూచ నలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, డిఆర్డిఓ మొగులప్ప, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, కోపరేటివ్ జిల్లా అధికారి ప్రసాద్ రావు, జిల్లా వెటర్నరీ & పశుసంవర్ధక అధికారి ఈశ్వర్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం షణ్ముఖ చారి, ఎల్డీఎం విజయకుమార్, డిపిఓ సుధాకర్ రెడ్డి, సైంటిస్ట్ రాజేంద్ర కుమార్, సమితి సభ్యులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:7.సమావేశంలో మాట్లాడుతున్న పొన్ను స్వామి 
----------------------------------------

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం