ధనార్జనే ధ్యేయంగా వాణిజ్య సముదాయాల్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు.
సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ కి విజ్ఞప్తి చేసిన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్ .
By Ram Reddy
On
మిర్యాలగూడ జనవరి 21
(లోకల్ గైడ్ తెలంగాణ)
రూల్స్ కు వ్యతిరేకంగా వాణిజ్య సముదాయాల్లో నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులను నియంత్రించాలని రోగాల పేరుతో పేదలను దోచుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ ని కలిసి విజ్ఞప్తి చేసినట్టు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ పట్టణంలో వైద్యం పక్కా వ్యాపారంగా మారిపోయిందని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను ఆర్థికంగా పీలిచి పిప్పి చేస్తున్నాయి మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని చిన్నపాటి రోగాన్ని కూడా పలు రకాల వైద్య పరీక్షలు చేయించి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. జ్వర బాధితులు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే రక్త పరీక్షల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ కనీసం లేబుల్లో ఆస్పత్రుల్లో కానీ ఫీజులో పట్టికను ఎక్కడ కూడా ఉంచడం లేదన్నారు వైద్యానికి ఒక్కొక్క ప్యాకేజీ నిర్ణయించి రోగులనుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్,ఎస్పీ నాయుడు,దొనేటి శేఖర్, తదితరులు పాల్గొన్నారు
Tags:
About The Author
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
