డ్వాక్రా మహిళల అభ్యున్నతికి కృషి .షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ నియోజక వర్గానికి 59 భవనాలు మంజూరు.  రూ. 5.90 కోట్లతో ఏప్రిల్ వరకు భవనాలు పూర్తి చేయాలి.

డ్వాక్రా మహిళల అభ్యున్నతికి కృషి .షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చౌదరిగుడా, ఫరూక్ నగర్, కేశంపేట, కొందుర్గు మండలాల్లో త్వరలోనే పనులు.  పార్టీలకు అతీతంగా గ్రామాల్లో పనులు వెంటనే ప్రారంభించండి.

లోకల్ గైడ్ :షాద్ నగర్ 

నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల అభ్యున్నతికి బాధ్యతగా కృషి చేయడమే ధ్యేయమని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం డ్వాక్రా మహిళ సహకార సంఘం నూతన భవనాలకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రకటించారు. సమావేశంలో ఆయన పేర్కొంటూ.. షాద్ నగర్ నియోజకవర్గంలో చౌదరిగుడా, ఫరూక్ నగర్, కేశంపేట, కొందుర్గు మండలాల్లో త్వరలోనే భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని రాజకీయాలకు కచ్చితంగా గ్రామాల్లో అభివృద్ధి కొనసాగాలని ఆయన కోరారు. 
చౌదరిగుడా 22 భవనాలు, ఫరూక్ నగర్ 17 భవనాలు, కేశంపేట11 భవనాలు, కొందుర్గు 9 భవనాలు ఆయా మండలాల్లో ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. సంబంధిత శాఖ మంత్రి సీతక్క చొరవతో భవనాలను నియోజకవర్గానికి పెద్ద ఎత్తున మంజూరు చేయడం పట్ల ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మరో 2 కోట్ల రూపాయల విలువైన భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఏప్రిల్ నాటికి త్వరలోనే పనులు పూర్తిచేయాలని కోరారు. దాదాపు తాను వచ్చాక 70 డ్వాక్రా మహిళా సంఘం భవనాలను మంజూరు చేయడం జరిగిందని రూపాయలు 8 కోట్లతో ఈ పనులు పూర్తి చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించేలా అనేక పథకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. మహిళలు బ్యాంకుల ద్వారా రుణాలను పొంది స్వయం ఉపాధి యూనిట్లను నెలకొల్పి అంచలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేన్నయ్య, అగ్గనూరు బస్వం, సర్వర్ పాషా, పురుషోత్తం రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సీతారాం తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు