మండల లీగల్ సర్వీస్ కమిటీ భద్రాచలం ఆధ్వర్యంలో  మెగా హెల్త్ క్యాంపు.

పాల్వంచ ఎల్ వి ప్రసాద్ కంటి వైద్యశాల మేనేజర్ దేవి, శంకర్రావు  ఆధ్వర్యంలో సిబ్బందితో  ఐ క్యాంపు మెగా క్యాంప్ ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన చర్ల ఎస్ఐ కేశవ్

మండల లీగల్ సర్వీస్ కమిటీ భద్రాచలం ఆధ్వర్యంలో  మెగా హెల్త్ క్యాంపు.

పీ హెచ్ సీ హోమియోపతి డాక్టర్ గుండెపూడి పూజ రోగులకు హోమియోపతి మందులు పంపిణీ చేసారు. 

IMG-20260124-WA0200భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలో ఉన్న లింగాపురం పంచాయతీ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు, మెగా హెల్త్ క్యాంప్ శనివారం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భద్రాచలం జడ్జి శివనాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్ల మండలంలో ఉన్న ఏజెన్సీ ఆదివాసి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వైద్యం చేపించుకోలేని స్థితిలో ఉన్నారని, అందుకే ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)ఈదయ్య ఈ మెగా క్యాంపు ఉద్దేశించి మాట్లాడారు. పాల్వంచ ఎల్ వి ప్రసాద్ కంటి వైద్యశాల మేనేజర్ దేవి, శంకర్రావు  ఆధ్వర్యంలో సిబ్బందితో లింగాపురం పాడు గ్రామంలో  ఐ క్యాంపు ఏర్పాటు చేసారని, చర్ల మండలంలో ఉన్న ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, మెరుగైన మందులు పంపిణీ చేసారని తెలిపారు. అనంతరం కొయ్యూరు పీ హెచ్ సీ హోమియోపతి డాక్టర్ గుండెపూడి పూజతో రోగులకు మెరుగైన వైద్యం చేసి, సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి మందులను ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిప్యూటీ డీ ఎం హెచ్ వో మల్లారపు శ్రీధర్, మాట్లాడుతూ ప్రజలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పటల్ కి పోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని, ఇక్కడ మెరుగైన వైద్యం, మందులు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల ఎస్ఐ కేశవ్ మాట్లాడుతూ చర్ల మండల ప్రజలు ఈ మెగా హెల్త్ క్యాంప్ ని ఉపయోగించుకొని మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. ఈ మెగా క్యాంప్ ఏర్పాటు చేసిన యువతకి,  భద్రాచలం జడ్జి శివ నాయక్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన లింగాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ లకు ఉపసర్పంచ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.   
 ఈ కార్యక్రమంలో  సీనియర్ న్యాయవాదులు అంబేద్కర్ తిరుమల రాజు,  ఆవులూరి సత్యనారాయణ,  పేరాల బండారు రమేష్,  సాధనపల్లి సతీష్, సంధ్య, శారద, బండ రామ లక్ష్మణ్, పరిటాల సంతోష్ ,  కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు