జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి
సందర్భంగా నివాళులర్పించిన బిసి జేఏసీ నాయకులు
By Ram Reddy
On
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి):
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం వర్ధంతి సందర్భంగామంగళవారం ఆల్విన్ కాలనీ చౌరస్తాలో గల బిసి జెఏసి కార్యాలయంలో అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఎర్ర సత్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బిసి జేఏసీ శేరిలింగంపల్లి అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ మాట్లాడుతూ..జనహృదయాల్లో చిరస్థాయి ముద్ర వేసిన నాయకుడు ఎర్ర సత్యం అని అన్నారు. జడ్చర్ల రాజకీయ చరిత్రలో ఎర్ర సత్యం పేరు ఒక స్వచ్ఛమైన దీప్తిలా వెలుగుతోందని సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణమైన ప్రజాసేవతో ఎదిగి, ప్రజల హృదయాలను గెలుచుకున్న ఆయన జీవితమే ఒక స్ఫూర్తి గాథ అని ఆయన అన్నారు. అధికారాన్ని స్వార్థం కోసం కాదు, సేవా ధర్మం కోసం వినియోగించాలన్న ధృఢ సంకల్పంతో ఆయన ప్రతి అడుగు వేసారని అన్నారు. గ్రామీణ అభివృద్ధి, పేదల సంక్షేమం విద్యా ప్రోత్సాహం ఏ రంగంలోనైనా ఆయన కృషి చెరగని గుర్తుగా నిలిచింది. మాట నిలబెట్టే స్వభావం, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిత్వం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే హృదయం ఆయనను నిజమైన ప్రజానాయకుడిగా నిలబెట్టాయి. ఆయన వర్ధంతి సందర్భంగా, ఎర్ర సత్యం సేవలు, త్యాగం, ప్రజల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.కృష్ణ, నర్సింలు, నర్సింగ్, మంగుబాయి, తాబాసుమ బేగం, సజీద బేగం, రాజు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author

Latest News
16 Aug 2025 09:49:06
https://youtu.be/-q66o0X_PAw?si=cTCR02yZyVGpw_vGhttps://youtu.be/-q66o0X_PAw?si=cTCR02yZyVGpw_vG