అధికారుల సహకారంతో మ్యాన్‌హోల్స్ మూతల ఏర్పాటు..గుండె గణేష్ ముదిరాజ్.

ఈ క్రమంలో హెచ్‌ఎంసీ నుంచి జెపీనగర్ వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల మ్యాన్‌హోల్స్ మూతలు

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని పాత ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ సీనియర్ నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌ఎంసీ నుంచి జెపీనగర్ వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల మ్యాన్‌హోల్స్ మూతలు పగిలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను గమనించిన సర్కిల్ అధికారులు వెంటనే స్పందించి, పగిలిపోయిన మ్యాన్‌హోల్స్‌కు కొత్త మూతలను ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతోనే ఈ పనులు చేపట్టామని గుండె గణేష్ ముదిరాజ్ తెలిపారు. అధికారుల సహకారంతో మరిన్ని ప్రజాప్రయోజన పనులు చేపట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు అధికారులు మంచి సహకారం అందిస్తున్నారని, కొన్ని సందర్భాలలో పనులు ఆలస్యం అయినప్పటికీ పార్టీ నాయకుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. ఇదే స్పూర్తితో ప్రజల సేవలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సహకరించిన అధికారులకు గుండె గణేష్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు