లోకల్ గైడ్ నారాయణపేట జనవరి 24:
గతంలో బి ఆర్ ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ నారాయణ పేట ప్రజలపై రాళ్లు వేసి అబ ద్ధాలతో మోసం చేశారని ఇప్పుడు అబద్ధాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ అన్నా రు.శనివారం నారాయణపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బిజెపి రాష్ట్ర సీనియర్ కే.రతంగ్ పాండు రెడ్డి,జిల్లా బిజెపి అద్యక్షుడు సత్య యాదవ్, జిల్లా కోశాధికారి సిద్ది వెంకట్ రాములు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి రఘు రామయ్య గౌడ్ లతో కలిసి మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు గడిచిన ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించా రు.రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహ రి వచ్చి సాధ్యం కాని హామీ లు ఎన్నో ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి మీరు తిరిగే నారా యణపేట మక్తల్ రోడ్డు ను చూస్తే మీరు సాధించిన అభి వృద్ధి మీకే అర్థమవుతుందని అన్నారు.డిసిసి మాజీ అధ్య క్షుడు శివకుమార్ రెడ్డి కి చిట్టెం కుటుంబం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నా రు.కాగా శుక్రవారం నారాయ ణపేట లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాన్ని కాగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చారని మండిపడ్డారు.ఈ కార్యక్రమా నికి ఏర్పాటు చేసిన బ్యానర్ లో కేవలం మంత్రికి మాత్రమే స్వాగతం పలికి ఎంపీ డి కే.అ రుణ పేరును విస్మరించారని అలాగే ఎమ్మెల్సీ ఫోటో సైతం పెట్టకుండా ప్రోటోకాల్ విస్మ రించారని అన్నారు. అంతే కాకుండా వేదిక మీద పార్టీ నాయకులను కూర్చోబెట్ట డం,అదే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ చైర్మెన్ పేరును ప్రకటిం చడం ఎంత వరకు సమంజస మని ప్రశ్నించారు.అలాగే పోలీసులు నిర్వహించిన రోడ్డు భద్రత కార్యక్రమంలో కేవలం కాంగ్రెస్ నాయకులను మాత్రమే ఆహ్వానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా లో 30 యాక్ట్ అమలులో ఉన్న కాంగ్రెస్ ర్యాలీ ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే అధికారులు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ కి కొమ్ము కాసే పరిస్థితి ఉందన్నారు.వెంటనే కలెక్టర్ స్పందించి మున్సిపల్ కమిషనర్ ను వెంటనే సస్పెం డ్చేయాలని,పోలీసుల తీరుపై ఎస్పీ స్పందించాలని డిమాం డ్ చేశారు.లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిం చారు.
ఫోటో రైట్ అప్:1.విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాగురావు నామాజీ
______________________