కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్,సీఎం సహాయక నిధి పేదలకు వరం.
లబ్ధిదారులకు మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, చేతుల మీదుగా చెక్కుల పంపిణీ.
లోకల్ గైడ్ /బంట్వారం:
పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయక నిధి, కళ్యాణ లక్ష్మి,షాద్ ముబారక్, ఓ వరం లాంటిదని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి,అన్నారు. బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశాల మేరకు, లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని, కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ పేదింటి ఆడపడుచు తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా, సీఎం సహాయనిధి,లక్షలు ఖర్చు చేసి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుందని,ఎవరైతే ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకోలేని పరిస్థితులో ఉంటారో అలాంటి వారి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కొండంత అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో మండల కేంద్రానికి చెందిన తుర్మామిడి,బస్వాపూర్,బొప్నారం, సల్బత్తాపూర్, యాచారం, మాల సోమవారం, గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్, సీఎంఆర్ఎఫ్, చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో, తహసిల్దార్ విజయకుమార్, సర్పంచ్ దుర్గం చెరువు మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోచారం వెంకటేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పి,యాదగిరి, వివిధ గ్రామ సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,తదితరులు, పాల్గొన్నారు.
