మహా శివరాత్రి మహోత్సవానికి శ్రీ మహా దేవాలయంలో ఘనంగా ఏర్పాట్లు

మహా శివరాత్రి మహోత్సవానికి శ్రీ మహా దేవాలయంలో ఘనంగా ఏర్పాట్లు

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

పఠాన్ చేరు నియోజకవర్గంలోని చైతన్య నగర్‌లో ఉన్న శ్రీ మహా దేవాలయంలో మహా శివరాత్రి మహోత్సవాలను త్రయాహ్నిక దీక్షతో ఘనంగా నిర్వహించేందు కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 14 నుండి 16, 2026 వరకు జరగనున్నాయి. పఠాన్ చేరు ఎమ్మెల్యే, ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్‌గా ఉన్న మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు గూడెం యాదమ్మ, అలాగే గూడెం కల్పన-మధుసుధన్ రెడ్డి దంపతులు మహోత్సవ ఏర్పాట్ లలో భాగస్వాములయ్యారు. వేద బ్రాహ్మణుల నిర్ణయాను సారం మాఘ బహుళ ద్వాదశి (2026 ఫిబ్రవరి 14) నుంచి మాఘ బహుళ చతుర్దశి (2026 ఫిబ్రవరి 16) వరకు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు గోపూజ, గణపతి పూజ, అఖండ దీపారాధన, గణపతి హోమం, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. రెండో రోజు రుద్రసహిత మన్యుసూక్త హోమాలు, ప్రదోషకాల పూజలు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, రాత్రి మహా లింగోద్భవకాలంలో మహాభిషేకాలు నిర్వహిస్తారు. చివరి రోజు మహా పూర్ణాహుతి, కుంభ ఉద్వాసన, ధ్వజ అవరోహణం, అవబృత స్నానం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ మహా శివరాత్రి మహోత్సవాల లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు ఆహ్వానించారు.

Tags:

About The Author

Latest News

కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాలతో  కమాండెంట్ రితీష్ కుమార్ ఠాకూర్ ఆదేశాలతో 
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్...
విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించాలి.
మార్చి 1న కరీంనగర్‌ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ప్రవేశ పరీక్ష.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు  అధ్యక్షులు దోసకాయల వెంకటేశం
హనుమంతుడు భక్తి,బలం, ధైర్యం మరియు నిస్వార్థ సేవకు ప్రతీక
బూర్గుల సంత ప్రారంభోత్సవానికి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అందే మోహన్ కు ఆహ్వానం.
గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర.