శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో సిటీ సిపి సజ్జనార్ ఆకస్మిక తనిఖీ
ఆయన స్టేషన్‌లోని జనరల్ డైరీ, రిసెప్షన్ రిజిస్టర్లు, పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు మరియు విచారణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
By Ram Reddy
On
శంషాబాద్, ఫిబ్రవరి 14 :
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, ఐపిఎస్ గారు శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లోని పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని జనరల్ డైరీ, రిసెప్షన్ రిజిస్టర్లు, పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు మరియు విచారణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.స్టేషన్ పనితీరును సమీక్షించిన
అనంతరం, సమర్థతను మరియు సమన్వయాన్ని పెంచేందుకు సిబ్బందికి కమిషనర్ గారు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారం: బాధితుల నుండి వచ్చే ప్రతి పిటిషన్‌పై విచారణాధికారులు సమగ్ర నివేదికలు రూపొందించాలని, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు.
అనంతరం, సమర్థతను మరియు సమన్వయాన్ని పెంచేందుకు సిబ్బందికి కమిషనర్ గారు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు త్వరితగతిన ఫిర్యాదుల పరిష్కారం: బాధితుల నుండి వచ్చే ప్రతి పిటిషన్‌పై విచారణాధికారులు సమగ్ర నివేదికలు రూపొందించాలని, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు.అంతర్రాష్ట్ర సమన్వయం: ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించేందుకు వీలుగా, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల ఎస్‌హెచ్‌ఓల తాజా సంప్రదింపు వివరాలను స్టేషన్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు.
మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం:
డ్రగ్స్ సరఫరా మరియు సంబంధిత నేరాలను అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, పక్కా సమాచారంతో నిందితులను పట్టుకోవాలని స్పష్టం చేశారు.
ప్రయాణికుల భద్రత - క్రమశిక్షణ:
విమానాశ్రయంలో మద్యం మత్తులో హల్చల్ చేసేవారు, మహిళా ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటువంటి వ్యక్తులను 'బ్లాక్ లిస్ట్'లో పెట్టేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
పోలీస్ హెల్ప్ డెస్క్:
విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు అరైవల్ ఏరియాలో ప్రత్యేకంగా 'పోలీస్ హెల్ప్ డెస్క్' ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు.
నేరస్తులపై నిఘా:
విమానాశ్రయ పరిసరాల్లో నేరాలను అదుపు చేసేందుకు, అంతర్రాష్ట్ర దొంగలు మరియు పాత నేరస్తుల పూర్తి సమాచారంతో కూడిన డేటాబేస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో శంషాబాద్ డిసిపి శ్రీ.బి. రాజేష్, ఏసిపి శ్రీ. శ్రీకాంత్ గౌడ్ మరియు ఇన్ స్పెక్టర్ శ్రీ. కనకయ్య సంపతి తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
27 Feb 2026 20:19:01
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :చర్ల మండల కేంద్రంలో ఉన్న రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో శుక్రవారం రాహుల్ హై స్కూల్ విద్యార్థులకు కేంద్ర రిజర్వ్...
