సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ

 

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 14 (లోకల్ గైడ్ ప్రతినిధి) 

హైదరాబాద్, ఎస్‌ఆర్ నగర్ డివిజన్ (బాపునగర్):నందు
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ గారు శనివారం ఎస్‌ఆర్ నగర్ డివిజన్ బాపునగర్‌లో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.రవి కిరణ్ , బాలు నాయక్, తరుణ్ జాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి ఆమె పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సంత్ సేవాలాల్ మహరాజ్ అని పేర్కొన్నారు. సమాజానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమం మరియు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమీర్‌పేట్ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్‌.ఎస్‌. రావు, శ్రీకాంత్ యాదవ్, పద్మావతి, పింకీ భాయ్, మదన్ సింగ్, ప్రతాప్ నాయక్, కృష్ణ కుమార్, అర్ఫాట్, మహేష్, వినోద్ , అనిత , రాజేష్, సునీత, అండలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News