గూడూరు ని నియోజకవర్గంగా ప్రకటించాలి

కలెక్టర్ కి వినతిపత్రం జేఏసీ నాయకులు 

గూడూరు ని నియోజకవర్గంగా ప్రకటించాలి

లోకల్ గైడ్ తెలంగాణ 
  
మహబూబాబాద్ జిల్లా  కలెక్టర్ కార్యాలయంలో 
 గంగారం,కొత్తగూడా కేసముద్రం,గూడూరు మండలాలను కలిపి పాత తాలూకా అయిన గూడూరు కేంద్రంగా   నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని గూడూరు  నియోజకవర్గ సాధన సమితి యువజన జేఏసీ నాయకులు సోమవారం రోజు గ్రీవెన్స్ సెల్ లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యువజన జేఏసీ గౌరవ సలహాదారులు. వాంకుడోత్ కటార్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.... గూడూరు నియోజకవర్గం ఏర్పాటు కావడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని పాత తాలూకా అయిన గూడూరు నియోజకవర్గంగా కొత్తగూడ గంగారం కేసముద్రం మండలాలను కలుపుకొని గూడూరు ను నియోజకవర్గంగా చేయాలని వారు జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్ర  రాష్ట్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గూడూరు ను నియోజకవర్గం చేసే దిశగా దశలవారీగా యువజన జేఏసీ పక్షాన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువజన జేఏసీ నాయకులు. ఎండి రహీం పాషా భూక్యా సురేష్ నాయక్ బానోత్ సునీల్ నాయక్ గోలి డానియల్. కుమార్,అశోక్, అరవింద్,మధు నాయక్,తదితరులు పాల్గొన్నారు
Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.