రైల్వే జిఎం కు సమస్యలు తెలియజేసిన ఎమ్మెల్యే ..

రైల్వే జిఎం కు సమస్యలు తెలియజేసిన ఎమ్మెల్యే ..

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


సికింద్రాబాద్ రైల్వే నిలయంలో
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పలు రైల్వే సమస్యలను జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు.ముఖ్యంగా రైల్వే సదుపాయాల అభివృద్ధి,ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం,స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా రైల్వే సేవలను విస్తరించడం వంటి అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు.సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులతో పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రైల్వే సదుపాయాలు అందించేందుకు తాను ఎల్లప్పుడు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!