వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల  నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ  సజావుగా నిర్వహించేందుకు  పూర్తి బాద్యత వహించాలి 

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  

వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల  నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ  సజావుగా నిర్వహించేందుకు  పూర్తి బాద్యత వహించాలి 

లోకల్ గైడ్, 

వికారాబాద్ జిల్లా మంగళవారం ఐ డి ఓ సి సమావేశం హాలు నందు విద్యా శాఖ అధ్వర్యంలో చీఫ్ సుపరింటేన్దేంట్లు మరియు మండల విద్యాదికారులకు   ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమం లో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో జరిగే   10వ తరగతి పరీక్షల నిర్వహణ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.పదవ తరగతి పరీక్షలు మార్చి14.03.2026 నుండి ప్రారంభం అవుతాయని,ఏప్రిల్ 16  వరకు పడవ తరగతి పరీక్షలు జరుగుతాయని ,జిల్లా లో 69  పరీక్ష సెంటర్ లు ఏర్పాటు చేయడం జరుగిందని, ఉదయం9.30  నుండి మద్యాహ్నం 12.30  గంటల వరకు పరీక్షలు ఉంటాయని, విద్యార్థులందరూ వారి వారి హల్ టికెట్లు సరిచూసుకోవాల్సిందని , అదేవిధంగా విద్యార్థులందరూ పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందుగానే సందర్శించి ,ప్రతిరోజు ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సిందిగా సూచించారు.  విద్యార్థులు మరియు పరీక్షలను నిర్వహించే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు మరియు సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోను తీసుకు రాకూడదని సూచించారు. పరీక్ష కేంద్రంలో మరియు పరిసరాల్లో సెల్ ఫోన్ లు పూర్తిగా నిషేదించినట్లుగా తెలిపారు.పదవ తరగతి పరీక్షలకు మొత్తం 13579 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు.  ఎక్కడ కూడా చిన్న సమస్య రాకుండా ప్రభుత్వ ఆదేశాల  ప్రకారం వెళ్లాలని, పరీక్షలకు సంబంధం లేని వ్యక్తులు  ఎవరిని కూడా పరీక్ష హాలు లోకి అనుమతించరాదని, మాస్ కాపీయింగ్ కు అవకాశం ఇవ్వరాదని  తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్,  వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరాదని  ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి  పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో ఫర్నిచర్ , త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం,  టాయిలెట్లు,  ఫ్యాన్లు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు.  పడవ తరగతి పరీక్షలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 
సమావేశం లో డిఈఓ రేణుకాదేవి,రామ్ రెడ్డి ఏ సి జి ఇ ,మండల విద్యాదికారులు ,  ప్రదానోపాద్యాయు లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం  జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):- జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో  జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు....
16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులు పరిశీలన
హెల్మెట్‌ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు....
వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల  నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ  సజావుగా నిర్వహించేందుకు  పూర్తి బాద్యత వహించాలి 
ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి 
డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి ప్రాణానికి లక్ష్యాలను సాధించాలి .