పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు....

వన్ టౌన్ కె శ్రీనివాసరావు 

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు....

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు,సెక్షన్163 బి ఎన్ ఎస్ ఎస్(144సెక్షన్)అమలలో ఉన్నట్లు వన్ టౌన్ సిఐ కె శ్రీనివాస రావు తెలిపారు.మొబైల్ ఫోన్స్,ఎలక్ట్రానిక్ పరికరాలు ఎవరు తీసుకురావద్దని తెలిపారు.బెల్లంపల్లి పట్టణ పరిధిలోని మొత్తం పరీక్ష కేంద్రాల్లో
25నుండి18వరకు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని తెలిపారు.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని,నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరగడం నిషేధం అని,పరీక్ష కేంద్రాల నుండి 200మీటర్ల పరిధిలోని అన్ని జిరాక్స్ కేంద్రాలు 25నుండి18వరకు ప్రతిరోజు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం1గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని,విద్యార్థులు పరీక్ష సమయం కన్నా అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.అదేవిదంగా పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని,కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తామన్నారు.ప్రశ్నాపత్రాల రవాణా,భద్రతా పరంగా ప్రత్యేక ఎస్కార్ట్ ను ఏర్పాటు చేశామన్నారు.సెంటర్ల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:

About The Author

Latest News

జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం  జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):- జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో  జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు....
16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులు పరిశీలన
హెల్మెట్‌ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు....
వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల  నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ  సజావుగా నిర్వహించేందుకు  పూర్తి బాద్యత వహించాలి 
ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి 
డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి ప్రాణానికి లక్ష్యాలను సాధించాలి .