మహబూబ్ నగర్ ఫిబ్రవరి 24 (లోకల్ గైడ్ జీవి గౌడ్
మహబూబ్ నగర్ జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకటేష్ మహబూబ్నగర్ అర్బన్ మండలంలోని రాటి పర్టిలైజర్ షాప్ ను ఆకస్మికంగా తనికి చేశారు.ఈ సంధర్బంగా యూరియా డిస్టిబూషన్ యాప్ ద్వారా ఏ విదంగా రైతులకు యూరియా సరఫరా చేస్తున్నారో పరిశీలించి .రైతుల అబిప్రాయాలు తెలుసుకున్నారు,రైతులు ఈ యూరియా యాప్ ద్వారా కొనుగోలు సులువుగా ఎటువంటి ఇబ్బందులు లేవని తమ సంతోషాన్ని తెలిచేశారు,గతంలో పనులు పనులు మానుకొని యూరియా కోసం క్యూ లైన్ లో పడి గాపులు కాయాల్సి వచ్చేదని ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యూరియా యాప్ ద్వారా ఎక్కడైనా బుక్ చేసుకొని తెచ్చుకోవచ్చని,ఈ యాప్ వచ్చే సీసన్ లలో కూడా యూరియా యాప్ ద్వారా సరఫర చెయ్యాలని రైతులు కోరడం జరిగింది. జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకటేష్ గారు మాట్లాడుతూ,జిల్లాలో యూరియా ఎలాంటి కొరత లేదని తెలిచేశారు.ప్రస్తుతం జిల్లాలో 14857 బ్యాగ్ ల యూరియా సరఫరా కు సిద్దంగా ఉంధన్నారు.అదే విదంగా జిల్లాలో ఇంతవరకు 82670 మంది రైతులు 309670 బుక్ చేసుకోగా 307550 యూరియా బ్యాగ్ లను సరఫరా చేయటం జరిగిందని తెలిచేశారు. జిల్లాలో కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ రైతులు కూడా యాప్ లో యూరియా పొందవచ్చని తెలియచేశారు,పారదర్శకంగానే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రైతులకు యూరియా సరఫరా యాప్ ద్వారా సరఫరా చేయటం జరుగుతుందని తెలిచేశారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబ్నగర్ బి.రాంపల్ గారు,వ్యవసాయ అధికారి మహబూబ్నగర్ అర్బన్ పి.శ్రీనివాసులు గారు మరియు రాటి పర్టిలైజర్ డీలర్ మరియు రైతులు పాల్గొన్నారు.