జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
జిల్లా ఎస్పీ నితికా పంత్.....
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
ఏప్రిల్1నుండి ఏప్రిల్ 30 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయని,నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నితికా పంత్ బుధవారం తెలిపారు.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా,ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు.డిఎస్పి,ఎఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,బహిరంగ సభలు,ప్రజలు గుమికూడి ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు.నిషేధిత ఆయుధాలు,దురుద్దేశంతో నేరాలకు ఉసి కోలిపే ఎటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు.ప్రజా జనజీవనానికి ఇబ్బంది,చిరాకు కల్పించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు,జన సమూహం అలాంటివి పూర్తిగా నిషేధం అన్నారు.చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు.నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరు పాటించాలన్నారు.ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని సూచించారు.30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతులు లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
