సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
-సీ పీ ఎం కార్యదర్శి కే. నరేంద్ర
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 1 :
అమెరికన్ సామ్రాజ్యవాదం, దురహంకార ఇజ్రాయిల్ దేశాలు కలిసి ఇరాన్ పై చేస్తున్న యుద్ధం సకల మానవాళికి కష్టాలను నష్టాలను ప్రమాదాన్ని తీసుకొని వచ్చిందని సిపిఎం సింగరేణి మండల కార్యదర్శి కే నరేంద్ర ఆరోపించారు.
పార్టీ సీనియర్ నాయకులు, గిరిజన హక్కుల పోరాట యోధుడు మాలో నాను నాయక్ 48వ వర్ధంతి సభ పార్టీ చీమలపాడు శాఖ కార్యదర్శి యనమనగండ్ల రవిబాబు అధ్యక్షతన జరగక కే నరేంద్ర మాట్లాడుతూ యుద్ధం ఇరాన్ కు మాత్రమే కాదని అమెరికాతో అంటగాగిన గల్ఫ్ దేశాలను సైతం తీవ్ర కష్టనష్టాలకు గురి చేస్తున్నదని దీనికి మద్దతు ఇవ్వడం ద్వారా మోడీ భారత దేశ స్వతంత్ర విధానాన్ని అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. హర్మిజ్ జల సంధి నుంచి భారత దేశ గ్యాస్ ఆయిల్ నౌకలను ఇరాన్ వదిలిపెట్టడం మోడీ యొక్క గొప్పతనంగా బిజెపి మూకలు చెప్పుకుంటున్నప్పటికీ భారతదేశంలోని ప్రజలు ఇరాన్ యుద్ధాన్ని ఇరాన్ పై యుద్ధాన్ని వ్యతిరేకించి సంఘీభావం తెలిపిన కారణంగానే వదిలేసామని ఇరాన్ ప్రకటించినది ఇది గమనించకుండా భాగాలు ఉండటం మానేయాలని విమర్శించారు. యుద్ధం కారణంగా భారతదేశంలో రైతులు కార్మికులు సమస్త ప్రజలు పెట్రోలు డీజిల్ గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీన్ని గమనించకుండా ప్రజలకు ఏ కష్టం కలగకుండా చూసుకున్నామని మోడీ చెప్పడం దుర్మార్గమని కె నరేంద్ర విమర్శించారు. వంటకి హోటల్స్ కి గ్యాస్ దొరకక ప్రజలు ఇబ్బంది పడుతుంటే కొరత లేదని చెప్పడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. ఈ కొరత వల్ల భవిష్యత్తులో రైతులకు కావలసిన ఎరువులు పురుగు మందులు తయారీ ఆగిపోతుందని వీటి కారణంగా బ్లాక్ మార్కెట్ చేసి కార్పొరేట్లు కోట్ల లాభాలు కూడగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అది పెట్రోలు డీజిల్ గ్యాస్ ద్వారా నిరూపితమైందని వీటికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా గ్రామ సభ తీర్మానం చేసిన వాటిని పక్కన పెట్టి అధికార పార్టీ నాయకులకు గెలిచిన సర్పంచుల ఇష్ట ఇష్టాలకు అనుగుణంగా మంజూరు చేయడం ఒక ఇంటికి 30 వేల నుండి 50 వేల రూపాయల వరకు గుంజుతున్నారని దీనివలన పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచి పోరాటాలు నిర్వహించాలని అదే ప్రస్తుత కర్తవ్యం అని పిలుపునిచ్చారు. సీతారామ ప్రాజెక్టు నీళ్లు కారేపల్లి మండలానికి ఇవ్వాలని ఈ బడ్జెట్ సమావేశంలోనే అందుకు సంబంధించిన తీర్మానం చేయాలని కే నరేంద్ర డిమాండ్ చేశారు.లేని ఎడల ప్రజలను సమీకరించి ఉధృత పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏరిపోతు భద్రయ్య జండా ఎగరవేశారు , తదనంతరం మన్యం బ్రహ్మయ్య పూలమాల వేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ మండల కమిటీ సభ్యులు అజ్మీర శోభన్ బాబు వల్ల పోయిన కొండలరావు , రాచబంటి పుల్లయ్య శాఖ కార్యదర్శి సూరపాక సర్వయ్య , బానోత్ కిషన్ , ప్రజానాట్యమండలి నాయకులు వాంకుడోత్ రామకోటి , పార్టీ సభ్యులు గోకినపల్లి భారత లక్ష్మి , రాచర్ల రణధీర్ , రాచర్ల విజయ్ , సోషల్ మీడియా కన్వీనర్ ధరావత్ వినోద్ కుమార్ , మాలోత్ హనుమ , మాలోతు రామకోటి , షేక్ సైదులు , శే రు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
