46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ  శంకుస్థాపన చేశారు. గౌరవ మంత్రివర్యులు తుమ్మల

46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన


ఖమ్మం: లోకల్ గైడ్ :

కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ  శంకుస్థాపన చేశారు. గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు  సహకారంతో సుమారు రూ.29.50 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో ఈ పనులు చేపడుతున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం మంత్రి తుమ్మల గారి ముఖ్య లక్ష్యమని తెలిపారు. జూబ్లీ పుర, సారథి నగర్ ప్రాంతాల్లో అవసరమైన చోట్ల సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. అభివృద్ధి విషయంలో మంత్రి తుమ్మల గారు ఎలాంటి రాజీ పడరని ఆమె పేర్కొన్నారు.
స్థానిక కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధికి మురికి కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణానికి సహకరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ మరియు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పనులు నాణ్యంగా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో డివిజన్‌ను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు షేక్ రజ్జి, ఓబీసీ నగర అధ్యక్షుడు బాణాల లక్ష్మణ్, వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా