ప్రజల మధ్యే సంక్షేమం… నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
గత పాలనలో అర్జీలు దూరం… ఇప్పుడు ప్రజల ముందే సంక్షేమం అందిస్తున్న ప్రజా ప్రభుత్వం…
By Ram Reddy
On
చెక్కుల పంపిణీ లో ఎమ్మెల్యే నాయిని.
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01(లోకల్ గైడ్
హనుమకొండ జిల్లా
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన మొత్తం 226 మంది లబ్ధిదారులకు రూ.2,26,26,216 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా 176 మంది లబ్ధిదారులకు రూ.53,25,500 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో సంక్షేమం అంటే కేవలం పథకాల ప్రకటనలు కాదు, ప్రజల ముందే, వారి చేతుల్లోకి నేరుగా సహాయం అందించడం అని తెలిపారు. లబ్ధిదారులను స్వయంగా పిలిపించి, గౌరవప్రదంగా కూర్చోబెట్టి చెక్కులు అందించడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు ఎంత చేరువలో ఉందో నిరూపిస్తున్నామని పేర్కొన్నారు.
గత పాలనలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, అర్జీలు కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయిందని విమర్శించారు. కానీ ప్రస్తుతం ప్రతి అర్హుడికి సంక్షేమం చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరవేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా,రానున్న ఎన్నికల్లో ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని సూచించారు.ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
01 Apr 2026 18:51:09
*
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్
వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
