నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*డాక్టర్.ఏ.రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్...వెల్లడి
*
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్
వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి జగన్నాథ దేవాలయ చరిత్ర పౌరాణిక నాటకం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సభ్యులందరమూ ప్రారంభం నుండి చివరి వరకు చూడడం జరిగినది. ఈ సందర్భంగా నాటక రచయిత అయిన పి.ఎల్.ఎన్ ప్రసాద్ రచయిత ను ముఖ్య అతిధులు అయిన నెల్లుట్ల రవీందర్ రావు ను, ఆత్మీయ అతిథి బన్న ఐలయ్యను ట్రస్ట్ చే శాలువా బొకేలతో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ మాట్లాడుతూ నాటకం రచించిన గౌరవనీయులకు అభినందనలు అన్నారు.ఓరుగల్లు ప్రజలు కలలకు కానాచి అయిన మన ఓరుగల్లు తరఫున మాట్లాడుతూ ఇటువంటి పౌరాణిక నాటకం ప్రదర్శించడం ప్రదర్శించిన కళాకారులందరికి అభినందన లు తెలియజేయడం జరిగినది. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఇటువంటి వాటిని ప్రోత్సహించడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం గతంలో జరిగిన పౌరాణిక ఘటనలన్నీ మరిచిపోవడానికి అవకాశం లేకపోలేదు. అందుకు గాను రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ ఇప్పటి ప్రజలకు భావితరాలకు పౌరులకు జ్ఞాపకం గా ఉంచేటట్టుగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చివరగా ఇందులో పాల్గొన్న డయాస్ మీద మరియు డయాస్ వెనుక ఉండి నడిపించిన పాల్గొన్న కళాకారులకు అందరికీ ప్రత్యేకంగా అతి త్వరలో ఘనంగా సన్మానం చేయడం జరుగుతుందని అన్నారు.నాటకంలో పాత్రలు మనకు పూరి జగన్నాథ్ దేవాలయం మన ముందున్నదా అన్నట్లు చిత్రీకరించడం నిర్మాణం ఏ విధంగా జరిగిందని మన కళ్ళ కట్టినట్టుగా చూపించడం చాలా అభినందనీయమైన విషయం అన్నారు. ఈ నాటక ప్రదర్శనలో అత్యధిక ప్రజలు పురుషులు మహిళలు. వృద్ధులు చూడడం అనేది పౌరాణిక నాటకాలకు నాందిగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ఇంకా త్రిపురాని గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
