చర్లలో టీ-10 అంతర్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల బ్రోచర్ ఆవిష్కరణ
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.
By Ram Reddy
On
చర్ల పోలీస్ గ్రౌండ్, గడికోటలో నిర్వహించనున్న టీ-10 అంతర్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న చర్ల సీఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి, మాజీ రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు, కురుకుందుల జితేందర్‌లు సంయుక్తంగా బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువతకు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి అంతర్ రాష్ట్ర స్థాయి పోటీలు గ్రామీణ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే మంచి వేదికగా నిలుస్తాయని తెలిపారు.
ఈ క్రికెట్ పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చర్ల మండలం యూత్ ప్రెసిడెంట్ జితేందర్, కమిటీ సభ్యులు, స్థానిక క్రీడాకారులు, క్రీడాభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
01 Apr 2026 18:51:09
*
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్
వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
