కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా

లో సి ఐ టి యూ నాయకుల బ్లాక్ డే నిరసనలు. 

కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా

 

రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):

కార్మికుల హక్కులను కలరాసే కార్మిక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిఐటియు రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు, మైలార్దేవ్ పల్లి డివిజన్ కన్వీనర్ భాస్కర్  డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని తీర్మానం చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ అమలుకు నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా లో ప్ల కార్డ్స్ లను ప్రదర్శిస్తూ రాస్తారోకో నిర్వహించి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. యడం ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలన్నారు. అదే విధంగా విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేరళ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి హామీ ఇచ్చిందన్నారు. తెలంగాణ  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే కాకుండా చేతల్లో కూడ అమలు చేయాలని కోరారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేస్తూ  హామీ ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలనీ, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంలో కార్మిక వర్గం  ఐక్యంగా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  కాటేదాన్ ఇండస్ట్రీ ఏరియా వర్కర్స్ యూనియన్  సీఐటీయూ   నాయకులు కిషోర్ కుమార్. శశికాంత్. దత్తు. ప్రవీణ్. సచిన్ మల్లేష్.. లక్ష్మణ్ .భాస్కర్.సయ్యద్ మజీద్. అలీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా