నైపుణ్యాభివృద్ధి, శిక్షణలే ఉపాధికి బాటలు
గీతం అప్రెంటిస్ షిప్ అవగాహన కార్యశాలలో స్పష్టీకరించిన ప్రభుత్వ అధికారులు
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): నైపుణ్యాభివృద్ధితో పాటు ఆచరణాత్మక పారిశ్రామిక శిక్షణ ద్వారా మంచి ఉపాధి అవకాశాలను పొందవచ్చని కేంద్ర ప్రభుత్వ అధికారులు నైపుణ్యాభివృద్ధి, శిక్షణనైపుణ్యాభివృద్ధి, శిక్షణలే ఉపాధికి బాటలులే ఉపానైపుణ్యాభివృద్ధి, శిక్షణలే ఉపాధికి బాటలుధికి బాటలుస్పష్టీకరించారు. హైదరాబాదు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం లోని కెరీర్ గైడెన్స్ కేంనైపుణ్యాభివృద్ధి, శిక్షణలే ఉపాధికి బాటలుద్రం (సీజీసీ), ఫుడ్ ఇండస్ట్రీ కెపాపిటీ అండ్ స్కిల్ ఇనిషియేటివ్ (ఎఫ్ఐసీఎస్ఐ) సహకారంతో ఒకరోజు అప్రెంటిస్ షిప్ అవగాహన కార్యశాలను నిర్వహించాయి. విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ అవకాశాలను పరిచయం చేయడంతో పాటు పరిశ్రమ యొక్క డిమాండ్లకు అనుగుణంగా వారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా సాగిన ఈ కార్యశాలలో కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల అధికారులు పాల్గొని, తగిన మార్గదర్శనం చేశారు.
తెలంగాణ ప్రాంతీయ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (ఆర్డీఎస్డీఈ) అధికారి వి.వి.సతీష్ రెడ్డి జాతీయ అప్రెంటిస్ షిప్ శిక్షణా పథకం (ఎన్ఏటీఎస్) గురించి పలు వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్మాణాత్మక, ఆచరణాత్మక పారిశ్రామిక శిక్షణ ద్వారా ఉపాధిని పెంచడంపై దృష్టి పెడుతుందని చెప్పారు. ఈ శిక్షణ విద్యా పరిజ్జానం, కార్యాలయ అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుందని రెడ్డి వివరించారు. తాజా పట్టభద్రులు, డిప్లొమా పూర్తిచేసిన వారిని ఉద్యోగానికి సిద్ధం చేసేలా తగిన నైపుణ్యాలను అందిస్తుందని, స్వయంగా వ్యవస్థాపకులుగా ఎదిగేలా కూడా దోహదపడుతుందని చెప్పారు. ప్రాథమిక, ఉద్యోగ శిక్షణ వంటి రెండు విధాలుగా సాగే ఈ కార్యక్రమంలో ముందస్తు నైపుణ్య శిక్షణ లేని వారితో పాటు నిర్దిష్ట సాధనాలు, యంత్రాలు, పరికరాలను నిర్వహించడం లో నైపుణ్యాన్ని పెంపొందిస్తామన్నారు.
నైపుణ్యం కలిగి శ్రామిక శక్తిని నిర్మించడంలో అప్రెంటిస్ షిప్ పాత్రను వివరించడంతో పాటు, దానికి ఆన్ లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేయాలో మార్గదర్శనం చేసే వీడియోను జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్డీసీ) సమన్వయకర్త పూనమ్ వర్మ ప్రదర్శించారు. ఫుడ్ ఇండస్ట్రీ కెపాపిటీ అండ్ స్కిల్ ఇనిషియేటివ్ (ఎఫ్ఐసీఎస్ఐ) సీనియర్ మేనేజర్ పుష్పితా రాణా తమ కార్పొరేషన్ చేపడుతున్న పలు కార్యక్రమాలు, కోర్సుల వివరాలను వెల్లడించడంతో పాటు వివిధ అప్రెంటిస్ షిప్ నమూనాలను విడమరచి చెప్పారు. ఆహార రంగంలో ఆహార భద్రత నిర్వహణ వ్యవస్థలు (ఎఫ్ఎస్ఎంఎస్) శిక్షణ అవకాశాలను కూడా చర్చించారు. విద్యార్థులతో నిర్వహించిన ముఖా ముఖిలో, కెరీర్ మార్గాలు, పరిశ్రమ అంచనాలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై లోతైన అవగాహనను ఆ అధికారులు కల్పించారు.
కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమాకాంత బాల్ స్వాగతోపన్యాసంతో ఆరంభమైన ఈ కార్యక్రమం, లైఫ్ సైన్సెస్ విభాగం (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) సమన్వయకర్త డాక్టర్ జి. నిహారిక వందన సమర్పణతో ముగిసింది. సీజీసీ డైరెక్టర్ డాక్టర్ కె.మమతా రెడ్డి, ఫుడ్ సైన్స్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
About The Author
