మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ లో నాలుగు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ విద్య కోసం ఎంపికయ్యారు .

జంట సోదరీమణులు పెండ్యాల లక్ష్య మరియు పెండ్యాల లాస్య

మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ లో నాలుగు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ విద్య కోసం ఎంపికయ్యారు .

కుత్బుల్లాపూర్ జనవరి 24 (లోకల్ గైడ్ ప్రతినిధి) 

అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నత విద్యను అభ్యసించేందుకు చాలా మంది తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్న ఈ సమయంలో, హైదరాబాద్ కు చెందిన జంట సోదరీమణులు పెండ్యాల లక్ష్య మరియు పెండ్యాల లాస్య అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ లో నాలుగు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ విద్యకోసంవీరుఎంపికయ్యారు.పెండ్యాల లక్ష్యకు బీ.టెక్ బయోమెడికల్ ఇంజినీరింగ్ కోర్సుకు సంబంధించి 100 శాతం ఫీజు మినహాయింపు తో పాటు వసతి, భోజన సౌకర్యాలతో కూడిన రూ. 2.50 కోట్ల విలువైన స్కాలర్షిప్ లభించగా, పెండ్యాల లాస్యకు బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సుకు రూ.1.32 కోట్ల విలువైన ఉపకార వేతనం దక్కింది. ఈ ఇద్దరు విద్యార్థినులు హైదరాబాద్లోని ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్లో గత రెండు సంవత్సరాలుగా సాట్, ఏ పిపరీక్షలు, ప్రొఫైల్ బిల్డింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందారు. ఇంటర్మీడియట్లో సాధించిన మార్కులు, అంతర్జాతీయ స్థాయి పరీక్షల్లో పొందిన ఉత్తమ ఫలితాలు, వివిధ ఎక్స్ట్రా-కరిక్యులర్ కార్యకలాపాలు మరియు వారు నిర్వహించిన సాంకేతిక ప్రాజెక్టులు ఈ భారీ స్కాలర్షిప్లులభించడంలోకీలకపాత్రపోషించాయని వారి తండ్రి శ్రీ పెండ్యాల శ్రీకాంత్తెలిపారు.ఇన్విక్టా కెరీర్ కన్సల్టెన్సీ సంస్థలో ఈ ఇద్దరితో పాటు మరో 20 మంది విద్యార్థులు ఇలాంటి ప్రతిష్టాత్మక స్కాలర్షిప్లు సాధించారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జొన్నలగడ్డ వివేకానంద మూర్తి గారు వెల్లడించారు. అదేవిధంగా, ఆ సంస్థ ద్వారా ఇద్దరు విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీలో, ముగ్గురు విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ ఆన్ ఆర్బర్ లో, ఐదుగురు విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అంహెర్స్ ట్ వంటి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల్లో నాలుగు సంవత్సరాల అండర్గ్రాడ్యుయేట్ విద్యకు ప్రవేశాలు లభించాయని ఆయన తెలిపారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు