మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న బాటనీ ఇంగ్లీష్,తెలుగు,కామర్స్,కంప్యూటర్,జువాలజీ గెస్ట్ లెక్చరర్ పోస్టులలో ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి అర్హులైన అభ్యర్థులు ఈనెల18లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు.సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55శాతం మార్కులతో పాటు(ఎస్సీ,ఎస్టీలకు 50శాతం) పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.పీహెచ్డీ లేనిపక్షంలో నెట్ అర్హత కలవారికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.నెట్ తర్వాత స్లెట్,సెట్ అర్హత గల వారిని తీసుకుంటామని తెలిపారు.పై అర్హతలు అభ్యర్థులు లేనిపక్షంలో సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.డిగ్రీ స్థాయిలో బోధన అనుభవానికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.ఎంపికైన వారికి ఒక్కో పీరియడ్ కు 390రూపాయల చొప్పున రోజుకు గరిష్టంగా 4పీరియడ్లను ఇవ్వడం జరుగుతుందని,గరిష్టంగా నెలకు 72పీరియడ్లకు గాను 28,080 రూపాయల రెమ్యూనరేషన్ లభిస్తుందని వివరించారు.ఇంటర్వ్యూలు మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జిల్లా ఐడి కళాశాలలో నిర్వహించినట్లు తెలిపారు.ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ సమయం సమాచారం మీకు ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా మెసేజ్ వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలియజేశారు.దరఖాస్తుకు సర్టిఫికెట్లు జారీచేయాలని,గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు1వ తరగతి నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్ అండ్ కండక్ట్ సర్టిఫికెట్లతోపాటు టెన్త్,ఇంటర్,డిగ్రీ,పీజీ,పిహెచ్డి,నెట్, సెట్ తదితర ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ లతోపాటు ఆధార్ కార్డు,లోకల్ సర్టిఫికెట్ జిరాక్స్ ప్రతులను దరఖాస్తుతో పాటు జత చేయాలని ప్రిన్సిపల్ తెలిపారు.దరఖాస్తులను బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కార్యాలయంలో ఈనెల18న సాయంత్రం 4గంటల లోపు అందజేయాలని సూచించారు.వివరాలకు సందేహాలకు 9959269975 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు.