ఘనంగా ఓంకారేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
By Ram Reddy
On
మిడ్జిల్ మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో ఓంకారేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పోటీలను నిర్వహించారు. పోటీలకు మంచి స్పందన లభించింది. మొదటి బహుమతిగా రూ.2,000, రెండో బహుమతిగా రూ.1,000, మూడో బహుమతిగా రూ.500 నగదు బహుమతులను ప్రకటించారు. మొదటి బహుమతి సత్తి, రెండో బహుమతి వెంకీ నరసింహ, మూడో బహుమతి సంజీవలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ అర్జున్, హరికృష్ణ, రఘు, దామోదర్, గణపతి రెడ్డి, సంజీవ, మధు, శరన్, యాదయ్య, రాజన్న, నాగమైసయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Tags:
About The Author
Latest News
14 Feb 2026 20:05:53
టీడబ్ల్యూజేఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్షులు అంబటి స్వామి డిమాండ్. 17నఛలో సమాచార భవన్"కు పిలుపు.
