ప్రజాయుద్ద నౌక గద్దర్ 78వ జయంతి వేడుక.

గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

ప్రజాయుద్ద నౌక గద్దర్ 78వ జయంతి వేడుక.

మిడ్జిల్ జనవరి 31(లోకల్ గైడ్):
 
మిడ్జిల్ మండల కేంద్రంలో  ప్రజా యుద్ద నౌక గద్దర్78వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా పలువురు  మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన సాహిత్యం ద్వారా యావత్తు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి న గొప్ప నేత గద్దర్ అని కొనియాడారు. తెలంగాణ రాష్టంలో 
తన ఆట పాటలతో ప్రజలను చైతన్యం చేసి తుది శ్వాస వరకు అణగారిన వర్గాల కోసమే పాటుపడి, తన పాటతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప 
ప్రజా గాయకుడు విప్లవ కవి,ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో  గుడ్ల బాలయ్య, బుచ్చయ్య, తిరుమల జంగయ్య, ఎండి ఉస్మాన్,ఎండి జహీర్, పల్లె తిరుపతి, రాజేష్, నందం, వై శ్రీనివాసులు, డీకే, తిరుపతి నాయక్,అంబేద్కర్ సంఘం సభ్యులు, అఖిలపక్ష నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News