గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.

కల్లు గీత కార్మిక సంఘం  కే జి కే ఎస్ జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ పిలుపు

గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.

లోకల్ గైడ్ తెలంగాణా కామారెడ్డి ప్రతినిధి 

 కల్లు గీత వృత్తి రక్షణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరాహారదీక్ష చేస్తున్నామని దీనికి  జిల్లాలో  గీత కార్మికులు తరలి రావాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు సైదగౌని వెంకట్ గౌడ్ పిలుపునిచ్చారు.ఈరోజు కామారెడ్డి లో జరిగిన జిల్లా కమిటీ సమావేశం అనంతరం కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం 
 వారు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందన్నారు. గత సంవత్సరం బడ్జెట్లో 70 కోట్లు మాత్రమే కేటాయించారు అవి కూడా డబ్బులు లేవనే పేరుతో విడుదల చేయలేదు. కేవలం 17 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో నైనా 5 వేల కోట్లు కేటాయించి గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గీత కార్మికులకు అనేక హామీలు ఇచ్చింది. పెన్షన్ 2 వేల నుండి 4 వేలకు పెంచుతామని,ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచుతామని అదికూడా నెల రోజుల లోపే ఇస్తామని చెప్పారు.ఇది పెంచక పోగా ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా డబ్బులు కూడా రెండు సంవత్సరాల నుండి ఇవ్వడం లేదు.850 మందికి 14 కోట్లు ఇవ్వాల్సి ఉంది.ఈ విషయమై స్వయంగా ముఖ్యమంత్రి గారికి మరియు అనేకసార్లు అధికారులకు, మంత్రుల దృష్టికి తీసుకుపోయాము. 2025 జూలై 14వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బాధితులతో నిరాహార దీక్షలు  చేశాము.2025 నవంబర్ 28వ తేదీన వేలాది మంది గీత కార్మికులతో సూర్యాపేటలో గీతన్నల రణభేరి నిర్వహించాం అయినా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి చేసి హక్కులు సాధించేందుకు రాష్ట్ర కార్యవర్గం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్షకు పూనుకుందని ఈ కార్యక్రమంలో గీత కార్మికులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు
డిమాండ్స్
రాష్ట్ర బడ్జెట్ లో కల్లుగీత కార్పొరేషన్ కు 5000 కోట్లు కేటాయించి గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలి.
కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు పెన్షన్ 4 వేలకు, ఎక్సిగ్రేషియా 10 లక్షలకు పెంచాలి.
పెండింగ్ ఎక్సిగ్రేషియా డబ్బులు వెంటనే విడుదల చేయాలి.
50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులందరికీ పెన్షన్ ఇవ్వాలి.
నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పాలి. నేక్లెస్ రోడ్డు లో మూసివేసిన నీరాకేఫ్ ను వెంటనే తెరిపించాలి.నందనములోని ప్రాజెక్ట్ కు తగిన నిధులు కేటాయించి ప్రారంభించాలి.
చెట్ల పెంపకానికి సొసైటీకి ఐదు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలి.
కల్లుగీత సొసైటీలను బలోపేతం చేయాలి.  కేంద్ర ప్రభుత్వం సొసైటీ 20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయాలి.
సభ్యులందరికీ ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి.
ఏజెన్సీ ఏరియాలో సొసైటీలను పునరుద్ధరించాలి.సంక్షేమ పథకాలన్నీ వారికి వర్తింవ చేయాలి.
కల్లులోని పోషకాలను, ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలి.
విద్య,ఉద్యోగం,స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ,లిక్కర్ షాపుల్లో గౌడులకు 25శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలి.
ట్యాంక్ బండ్ పై పాపన్న విగ్రహం నెలకొల్పాలి. జనగామ జిల్లాకు పావన్ప పేరు పెట్టాలి.h
కల్లు షాపులపై ఎక్సైజ్ దాడులను అరికట్టాలి.ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు వెంకట్ గౌడ్  జిల్లా కార్యదర్శి రాజా గౌడ్, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, రవీందర్ గౌడ్, స్వామి గౌడ్, సాయ గౌడ్, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు 
అభివందనములతో
S, వెంకట్ గౌడ్ 
జిల్లా అద్యక్షులు 
కేజీక్స్ కామారెడ్డి

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం