శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, సేవాభావం, ప్రజాసేవలో, ప్రజల పక్షాన నిలిచి ముందుండే నాయకులు, బిల్డర్ వాసిలి చంద్రశేఖర రావు ముందడుగు వేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జ్యూట్ బ్యాగులను మాజీ మంత్రి కేటీ రామారావు, మాజీ ఎంపీ రమణ సమక్షంలో వాల హరీష్ రావుతో కలిసి అందజేశారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యా వరణానికి కలిగే నష్టం గురించి ఈ సందర్భంగా నేతలు చర్చించారు. జ్యూట్ వంటి సహజ వనరులతో తయారయ్యే బ్యాగులు వాడడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని అభిప్రాయ పడ్డారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జ్యూట్ బ్యాగులను వినియో గించాలనే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పర్యావరణ హిత విధానాలను ప్రోత్సహిస్తోందని, ప్రజలు కూడా ప్లాస్టిక్‌కు బదులుగా పునర్వినియోగ పరచగల వస్తువులను ఉపయోగించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై సమాజంలో మరింత చైతన్యం పెంపొందుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.