లోకల్ గైడ్ తెలంగాణా కామారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ)కు అక్రిడిటేషన్ రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించినందుకు శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో టిజేఏ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజేఏ వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ కృషి, టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణారావు పట్టుదల, రాజేంద్రనాథ్, గోరి, తెలంగాణ జర్నలిస్టుల అసోసియేషన్ కమిటీ సహకారంతో విజయం సాధించడం హర్షనీయన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, కృషి చేస్తామని జర్నలిస్టులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా అధ్యక్షుడు సడక్ సునీల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొడకల గోవర్ధన్, సభ్యులు నక్క సిద్ధ రాములు, వింజమూరు వెంకటేష్, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, నక్క మల్లేశం, శ్రీధర్, సాయిలు, రాజు తదితరులు పాల్గొన్నారు.