ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 

సంత్ సేవలాల్ జయంతి సందర్బంగా ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ ను సన్మానించిన బంజారా సోదరులు

ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 


 .                   
రంగారెడ్డి జిల్లా బ్యూరో ఫిబ్రవరి 14,( లోకల్ గైడ్ ): ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్  విభాగంలో పిహెచ్ డీ పట్టా పొందడంపై పలువురు బంజారా సోదరులు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆదివారం ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ ను శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. 2018 లో పొలిటికల్ సైన్స్ విభాగం లో " ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్  ఏ స్టడీ ఆఫ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ  స్టేట్" అనే అంశంపై పరిశోధన చేశారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరి గూడెం  మండలంలోని గాలి గూడెం నంద్యా తాండకు చెందిన లక్ష్మి బొట్య నాయక్  నాలుగవ సంతానం అయిన ప్రొఫెసర్ రాజు నాయక్ ఉస్మానియా యూనివర్సిటీలో  పొలిటికల్ సైన్స్ లో పిహెచ్డి పట్టా పొందడం అభినందనీయమని పలువురు బంజారా నాయకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రాజు నాయక్ మాట్లాడుతూ ... కడు పేదరికం నుంచి గ్రేటర్ హైదరాబాద్ లోనే తెలంగాణకే పునాది రాయిగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో తాను పొలిటికల్ సైన్స్ లో పీహెచ్ డీ పూర్తి చేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే ఉస్మానియా యూనివర్సిటీ తనకు మంచి జ్ఞానాన్ని,  భవిష్యత్తును ఇచ్చిందని ప్రొఫెసర్ రాజు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నతాధికారులు,  అధ్యాపకులు, తన ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన న్నారు. తనకు దక్కిన ఈ డాక్టరేట్ నాపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం