మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల బెల్లంపల్లి 34వ వార్డు బిజెపి కౌన్సిలర్ కొక్కుల రామ్మూర్తి వార్డు అభివృద్ధి కోసం అధికార పార్టీతోనే కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు.ఈ మెరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.గత శనివారం బిఆర్ఎస్ పార్టీలో చేరినట్టుగా,బిఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థికి ఓటు వేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో,వివిధ టివి చానల్స్ లో తప్పుడు వార్తలు వస్తున్నాయని తెలిపారు.ఈ ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.తాను బిఆర్ఎస్ పార్టీలో చేరలేదని,బిఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం లేదని,బిజెపిలోనే ఉన్నానని ఉంటానని పేర్కొన్నారు.కానీ,తనను నమ్మి తాను వార్డుని అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో తనను గెలిపించిన ప్రజల కొరకు,తన వార్డుని అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీతో కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని,ఆ దిశగా తాను అధికార పార్టీకి మద్దతు తెలిపి వారికి సహకరిస్తు వార్డును అభివృద్ధి చేసుకుంటానని తెలిపారు.అయితే గత మూడు రోజులుగా బిజెపి అభ్యర్థి ఎవరి వైపు ఉంటాడోనని జిల్లావ్యాప్తంగా చర్చలు నడుస్తున్నాయి.ఆదివారం ఆయన ప్రకటనతో ఉత్కంఠకు తెరపడింది.