నారాయణపేట లోకల్ గైడ్ ఫిబ్రవరి 6:
మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ ఆడపడుచుగా తనను గెలిపించాలని 15 వ వార్డు బిజెపి అభ్యర్థి లక్ష్మి శ్యామ్ సుందర్ గౌడ్ గెలిచి ప్రజలకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం వార్డులో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సంద ర్బంగా మాట్లాడుతు హామీలు ఎగ్గొట్టి మాట తప్పిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందాలని కాంగ్రెస్ నాయకులు మితిమీ రిన హామీలు ఇస్తున్నారని వారి మాయ మాటలు నమ్మొద్దని కోరారు.కాంగ్రెస్ అధికా రంలో కి వచ్చి రెండున్నరేళ్లు కావ చ్చిన మున్సిపాలిటీల అభివృద్ధికి నయా పైసా నిధులు కేటాయించలేదని విమర్శించారు. కానీ ఎన్నిక లు రావడం తోమంత్రు లు,ఎమ్మెల్యేలు ,నాయకులు వందల కోట్ల నిధు లతో పట్టణాల అభివృద్ధి చేస్తామ ని జూటా మాటలు మాట్లాడు తున్నారని అన్నా రు.చిత్త శుద్ది ఉంటే ఈ రెండు న్నర ఏళ్లలో నారాయణపేట పట్ట ణంలో ఒక్క అభివృద్ది పని చూపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రగతి ఏమిటంటే పట్ట ణం లోని 65 వేల మందికి జిల్లా ఆస్పత్రిని 12 కిలో మీటర్ల దూరం తరలించి వైద్యం దూరం చేయడమేనని ద్వజ మెత్తారు.పట్టణంలో జరిగిన అభివృద్ది కేవలం కేంద్రం నిధులతోనేనని అన్నా రు.ప్రజలను పట్టించుకొని పూటకో పార్టీ మారే వ్యక్తు లకు బుద్ధి చెప్పాలని కోరారు.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మరింత అభివృద్ది కి ఆస్కారం ఉంటుందని బిజెపి నీ గెలిపించాలని కోరారు
ఫోటో రైట్ అప్:8.ప్రచారం చేస్తున్న లక్ష్మీ
_______________________