మిర్యాలగూడ జనవరి 24
( లోకల్ గైడ్,తెలంగాణ )
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ మహిళా అధ్యక్షురాలు మంద పద్మావతి తన అనుచరులతో కలిసి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెడ్డి కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 35వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దైద సత్యం సమక్షంలో వీరంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ లో చేరిన నాయకులకు గులాబీ కండువాలను కప్పి టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ తమ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నల్లమోతు సిద్దార్థ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలు అధికమయ్యాయని అన్నారు. రేవంత్ సర్కార్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత నల్లమోతు భాస్కర్ రావు కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన అనేక ప్రజా సంక్షేమ పథకాలు యావత్ దేశానికి దిక్సూచిగా మారాయని అన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనపై విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో చేరిన ప్రతీ కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తున్నామని అన్నారు. సభ్యత్వాల నమోదులో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం,డంపింగ్ యార్డు, రైతు వేదికలను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని అన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసిందని అన్నారు. కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా గ్రామాల్లో అడుగంటిన చెరువులన్నీ ప్రస్తుతం జలకళతో దర్శనమిస్తున్నాయని అన్నారు. అనేక మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతున్నదని అన్నారు. రైతులకు పంట పెట్టుబడిసాయం చేయాలనే ధృఢ సంకల్పంతో రైతు బంధు, రైతు బీమా వంటి చారిత్రాత్మక పథకాలను కేసీఆర్ రూపకల్పన చేశారని అన్నారు. ఈ రెండు పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూ.1,00,116 మేనమామ కట్నంగా కేసీఆర్ సర్కార్ అందజేసిందని చెప్పారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యంగులు, వృద్ధులకు, బీడీ కార్మికులకు ప్రభుత్వం పెన్షన్ అందజేసిందని అన్నారు. దశాబ్దాల భూవివాధాలను తెరదించి భూయజమానులకు హక్కులు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ధరణీ పోర్టల్ ను రూపొందించిందని అన్నారు. నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్ధిక భరోసా కల్పించిందని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా నల్లమోతు భాస్కర్ రావు కృషిచేశారని అన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నల్లమోతు సిద్దార్థ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, మగ్ దూం పాషా, పశ్య శ్రీనివాస్ రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, షోయబ్, దైద వెంకటేష్, కోలా రామస్వామి, నేరెళ్ళ శివ, పెండెం పద్మావతి, షెహనాజ్ బేగం, కోదాటి రమ, సరస్వతి, జయమ్మ, మొండికత్తి లింగయ్య, సత్యనారాయణ, బాలు నాయక్, శ్రీకాంత్, శంకర్, నరేష్, కిరణ్, వెంకటేష్, రవి కిషోర్, సైదులు, పవన్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.