ఎం పీ నిధులతో చేతి పంపు ఏర్పాటు
ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి సహకారంతో హనుమాన్ గుడి వద్ద హ్యాండ్ బోర్‌ను ఏర్పాటు
కారేపల్లి మండల పరిధిలోని పొలంపల్లి తండా గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి సహకారంతో హనుమాన్ గుడి వద్ద హ్యాండ్ బోర్‌ను ఏర్పాటు చేసినట్లు పిఎస్ఆర్ యూత్ అధ్యక్షులు జర్పల ధోని నాయక్ సర్పంచ్ హేమలత తెలిపారు. బోర్ డ్రిల్లింగ్ పనులను సర్పంచ్ ధారావత్ హేమలత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ హేమలత మాట్లాడుతూ.. గ్రామ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించి ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన ధోనీ నాయక్‌ను అభినందించారు. గ్రామ అభివృద్ధే తమ లక్ష్యమని, ముందు ముందు గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు గుగులోతు సక్రు, ధారావత్ బద్రునాయక్, ఉప సర్పంచ్ గుగులోతు సర్వన్, వార్డు సభ్యులు లావణ్య, రమేష్, కవిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీముడు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కల్యాణ్, గ్రామ పెద్దలు ధారావత్ భద్య, భూక్యా బద్రు, గుగులోతు భీముడు, మునీరాం, రమేష్, భూక్యా బాలు, లాలు, లక్మణ్ తదితరులు పాల్గొన్నారు.
