రక్షణే కాదు,,సేవలోనూ ఖాకీలు ముందు వరుసలో

తల్లిదండ్రుల విన్నపానికి స్పందించి యువకుడికి మెరుగైన చికిత్స

రక్షణే కాదు,,సేవలోనూ ఖాకీలు ముందు వరుసలో

మానవత్వం చాటుకున్న జీడిమెట్ల పోలీసులు

సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతల లోను పోలీసులు ముందుంటారని జీడిమెట్ల పోలీసులు మరోసారి నిరూపించారు. మానసిక సమస్యతో బాధపడుతున్న 26 ఏళ్ల యువకుడికి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు తక్షణ సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. యువకుడి పరిస్థితిని గమనించిన పోలీసులు ముందుగా అతనికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం తమ వాహనంలోనే యువకుడిని హైదరాబాద్‌లోని ఇన్స్ ట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కు తరలించారు. అక్కడ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయించి, అతనికి మెరుగైన వైద్యసేవలు అందేలా వైద్య బృందాన్ని అభ్యర్థించారు. ప్రజల కష్టాలలో భాగస్వాములు కావాలని సిపి రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆపద సమయంలో అండగా నిలిచిన పోలీసుల సేవలను యువకుడి కుటుంబ సభ్యులు ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా జీడిమెట్ల పోలీసుల ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.

Tags:

About The Author

Latest News

ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి. ఎకో హిల్ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రాంత అభివృద్ధి; సీఎం రేవంత్ రెడ్డి.
శంషాబాద్ , మార్చ్ 6(లోకల్ గైడ్); రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం స్ఫూర్తితో తొలి రోజు హిల్ పార్క్ ప్రారంభోత్సవం...
షాద్‌నగర్ సీఐ కే. సీతారాంను మర్యాదపూర్వకంగా కలిసిన
జిల్లా స్థాయి  బాలమేళాకు విద్యార్థుల ఎంపిక
శేరిలింగంపల్లి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి.
తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం 
వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..