శ్రీ గురులోక్ మాసంధ్ ప్రభు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి         

పేట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.  

శ్రీ గురులోక్ మాసంధ్ ప్రభు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి         

నారాయణపేట మార్చి 28:
నారాయణపేట జిల్లా  కొత్త పల్లి మండలంలోని తిమ్మా రెడ్డి పల్లి లో  వచ్చే నెల ఏప్రిల్ 1  నుంచి 4 వరకు జరిగే శ్రీ గురు లోక్ మాసంద్ ప్రభు ( బావోజి) జాతర బ్రహ్మోత్సవాలకు అధికారు లు పగడ్బందీగా అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాలని నారాయణపేట జిల్లా  కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. నాలుగు రోజుల పాటు  జరిగే  బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం  తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో గల  బావోజీ ఆలయ అవరణలో సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో ఉత్సవాల  ఏర్పాట్ల గురించి  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ ఫణింద్ర రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందు కలెక్టర్, కడ ప్రత్యేక అధికారి, అదనపు కలెక్టర్ ఆలయంలో (బావోజీ )గురు లోక్ మాసంద్ ప్రభు కు  ప్రత్యేక పూజలు చేశారు. పక్కనే ఉన్న కాళి మాత ఆలయంలోనూ పూజలు నిర్వహించారు. జాతర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్  ప్రతీక్ జైన్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో  భాగంగా
ప్రతి శాఖకు సంబంధించిన అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, నిర్వహణ కు ఆర్డీవో రామచందర్ నాయక్ ప్రత్యేక అధికారిగా పర్యవేక్షణ చేస్తారని ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ పరంగా ఏం ఏర్పాట్లు చేశారని కలెక్టర్ ప్రశ్నించగా రథానికి కలర్స్ వేయిస్తున్నామని, మిగతా జాతర ఏర్పాట్లు చేస్తున్నామని, జాతర కోసం తమ శాఖ నుంచి మొత్తం 12 మంది ఉద్యోగులు సిబ్బందిని డిప్యూట్ చేసినట్లు, గతేడాది మాదిరిగానే ఈ సారి ఆలయంలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు  దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి కలెక్టర్ కు తెలిపారు. మిషన్ భగీరథ పరంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నీటి వసతి కల్పించామని, అలాగే భక్తుల కోసం 75 మరుగు దొడ్లు, స్నానపు గదులను ఏర్పాటు చేసినట్లు మిషన్ భగీరథ ఈఈ రంగారావు తెలిపారు. శానిటేషన్ పరంగా దాదాపు 480 మందితో 12 క్లస్టర్ గా తాగునీటి,  పారిశుద్ధ్య పనులు చేస్తారని, మూడు సిఫ్టులలో వంద మంది చొప్పున 17 ట్రాలీలతో కార్మికుల సేవలు  అందుబాటులో ఉంటాయని డీపీవో సుధాకర్ రెడ్డి తెలిపారు. జాతర నాలుగు రోజులు తిమ్మారెడ్డి పల్లి లో సెల్ ఫోన్ లకు సిగ్నల్స్  ఉండవని, తమకు పోలీసు శాఖ నుంచి వాకీ టాకీ లు ఇస్తారని తెలపగా, స్పందించిన కలెక్టర్ ప్రతీక్ జైన్  జియో, ఎయిర్ టెయిల్  ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి  జాతర జాతరలో  నెట్ వర్క్ ఎక్కువ ఉండేలా చూడాలని ఆర్డీవో రామచందర్ నాయక్ కు  సూచించారు. ఒక డాక్టర్, సూపర్ వైజర్ , ఏ ఎన్ ఎం, ఆశాలతో మూడు సిఫ్టులలో క గతేడాది ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఈసారి రెండు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, అలాగే రెండు మొబైల్ యూనిట్స్ వైద్య సేవలు అందిస్తారని  వైద్య శాఖ ప్రోగ్రామ్ అధికారి కలెక్టర్ కు తెలుపగా,  వీలైనంత ఎక్కువ  ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో  ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అయితే మందులను నిల్వ చేసేందుకు తమకు ఆలయ ప్రాంగణంలో ఒక గదిని  కేటాయించాలని ప్రోగ్రామ్ అధికారి కోరగా  వారికి ఒక గదిని కేటాయించాలని కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారిని ఆదేశించారు. ఆలాగే పాము కాటు మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. జాతరలో ముఖ్యంగా పార్కింగ్ ఏర్పాట్లు చాలా అవసరం అని, జాతరలో పిక్ పాకెటింగ్ జరగకుండా పోలీసులు నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఇక విద్యుత్ శాఖ పరంగా 50 లక్షలతో ప్రత్యేకంగా జాతర కోసం ఫీడర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ ఎస్.ఈ నవీన్ కుమార్ తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం కోస్గి, నారాయణ పేట ఆర్టీసీ డిపో ల నుంచి 8 బస్సులను నడిపిస్తామని, జాతరలో తమకు రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను కేటాయించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. బస్ పార్కింగ్ ప్రాంతాల్లోనూ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని డీ ఎం కోరగా  మొబైల్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేస్తామని డిపివో సుధాకర్ రెడ్డి తెలిపారు.  అగ్నిమాపక శాఖ పరంగా  ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఫైర్ అధికారి చెప్పారు. జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు  సీఐ సైదులు తెలిపారు. ముఖ్యంగా జాతరలో దొంగతనాలు, ఈవ్ టీజింగ్ జరగకుండా మఫ్టీ పోలీసులతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.  జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తిమ్మారెడ్డి పల్లి సర్పంచి జ్ఞానేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జాతర ముగిసిన తర్వాత  ఆలయ ప్రాంగణంతో పాటు  పరిసర ప్రాంతమంతా వ్యర్థాలతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుందని, జాతర ముగిసిన తర్వాత కూడా అంతా శుభ్రం చేయించాలని  కోరగా డిపివో సానుకూలంగా స్పందించారు. చివరగా కలెక్టర్ ప్రతీక్ జైన్  మాట్లాడుతూగతేడాది ఎలా ఏర్పాట్లు చేశారో ఈ సారి అలాగే చేయాలని, గతేడాది జాతర ఉత్సవాలలో జరిగిన లోటు పాట్లను దృష్టిలో ఉంచుకొని ఈ సారి అలా జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సారి జాతర ఉత్సవాలకు తాను కొత్తగా  వచ్చాననీ, కానీ ఇక్కడున్న అధికారులంతా చాలా సీనియర్లు అని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.  జాతర జరిగే  ప్రాంతం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న  నియోజక వర్గం పరిధి అని, ప్రోటోకాల్  విషయంలో చాలా జాగ్రత్త వహించాలని, ఎవరు పడితే వారిని  అనుమతించవద్దని అయిన పోలీసులకు  సూచించారు. ప్రోటోకాల్ పరంగా ముఖ్యమైన వాళ్లు వచ్చినప్పుడు వాళ్ళ దర్శనం విషయంలో భక్తులు అసౌకర్యానికి గురి కావద్దని, సంయమనం పాటించాలని  కోరారు. ఇక జాతర జరిగే ప్రాంగణంలో ఎలా పడితే అలా దుకాణాలు ఏర్పాటు చేయకుండా  విశాలమైన రహదారి కి స్థలాన్ని వదిలి దుకాణాలు ఏర్పాటు చేయించాలని, రహదారి మార్కింగ్ హద్దు దాటి ఎవరైనా దుకాణాలు ఏర్పాటు చేస్తే  వెంటనే వాటిని తొలగింప చేయించాలని పోలీసు అధికారి సైదులు ను ఆయన ఆదేశించారు. అన్నింటికంటే జాతరలో పారిశుద్ధ్యం ముఖ్యమని, ఆరోగ్యంతో జాతరకు వచ్చిన భక్తులు అనారోగ్యంతో  తిరిగి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత  అధికారులందరిపై ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ మొగులప్ప, పీ.ఆర్. ఈ.ఈ అశోక్, తహాసిల్దార్  జయరాములు, సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.    
ఫోటో రైట్ అప్ :8.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్    ---------------------------------------

Tags:

About The Author

Latest News