కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కుష్టు వ్యాధిగ్రస్థులపై వివక్ష చూపొద్దు

కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం.. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కుష్టు వ్యాధి మందులతో పూర్తిగా నయమవుతుంది

IMG-20260130-WA0121ఖమ్మం లోకల్ గైడ్
మహాత్మాగాంధీ మార్గదర్శకాలు పాటించడమే వారికిచ్చే ఘన నివాళి
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతిఒక్కరు తమవంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చేపట్టిన జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ వర్థంతి ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,జాతిపిత మహాత్మాగాంధీ మార్గదర్శనంలో నడవడమే ఆయానకిచ్చే ఘన నివాళి అన్నారు. మహాత్మా గాంధీ ని ఒక జర్నలిస్ట్ మీ జీవితం ద్వారా ఏం చెప్పదల్చుకున్నారు అని అడుగగా, నా జీవితమే ఒక సందేశమని మహాత్మా గాంధీ అన్నారని తెలిపారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, వివక్షకు గురై ఎన్నో అవమానాలకు మహాత్మా గాంధీ గురయ్యారని అన్నారు. ఒక తెల్ల జాతీయుడు, మహాత్మా గాంధీ ని జాతి వివక్ష తో రైలు నుండి గెంటివేసినప్పుడు, సత్యానికి, న్యాయానికి మహాత్మా గాంధీ పోరాడారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం లాంటి ఎన్నో ఉద్యమాలతో హింసకు తావులేకుండా, అహింసా మార్గంలో స్వాతంత్ర్యాన్ని సాధించారన్నారు. కుష్టు రోగులకు సమాజంలో వివక్ష, ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, వారికి ఆరోగ్యం, సమాజంలో వివక్ష తొలగించే విధంగా సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ సేవాలందించారన్నారు.

కుష్టు వ్యాధి ఎవరి తప్పు కాదని, బాధితులను వివక్షకు గురిచేయవద్దని కలెక్టర్ అన్నారు. మందులతో పూర్తిగా నయమయ్యే జబ్బని, కుష్టు రోగులకు సహాయంగా నిలవాలని అన్నారు. కుష్టు వ్యాధికి పూర్తి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని, 12 నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుందని తెలిపారు. కుష్టు వ్యాధి లక్షణాలు, మచ్చలు ఏర్పడినప్పుడే, వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నారు. జిల్లాలో గుర్తించిన 74 మంది కుష్టువ్యాధిగ్రస్థుల ఉచిత చికిత్స అందిస్తున్నామన్నారు. అనుమానిత ప్రతిఒక్కరికి పరీక్షలు చేయాలన్నారు. స్పర్శ కుష్టు వ్యాధి ప్రచార కార్యక్రమాన్ని 30 జనవరి నుండి 13 ఫిబ్రవరి వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అన్నారు.

కుష్టు రహిత సమాజ నిర్మాణం, వ్యాప్తిని అడ్డుకోవడం, వ్యాధిగ్రస్తులపై ఉన్న కళంకాన్ని తొలగించి, వారికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించడమే లక్ష్యంగా వెళ్ళాలన్నారు. కుష్టు వ్యాధిపట్ల ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేయాలన్నారు. 

కార్యక్రమంలో కుష్టు వ్యాధి నిర్మూలనకై అధికారులు, సిబ్బందిచే వాగ్దానం చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రామారావు, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, అదనపు వైద్య ఆరోగ్య అధికారి డా. చందు నాయక్, ఉప జిల్లా వైద్య అధికారి డా. వేణు మనోహర్, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, వైద్యాధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల. మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య
అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం
కాంగ్రెస్ బీఫాం విషయంలో క్యాంపు కార్యాలయం వద్ద ఉత్కంఠ..
నాలుగో వార్డ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జోరుగా ప్రచారం.
సి ఎం నిర్ణయంతో "హరి"నారాయణ
తిరుపతమ్మ తల్లి మాలదారుల ఇరుముడి కట్టు