తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గడ్డ యాదయ్య అధ్యక్షతన మాదిగ డైరీ ఆవిష్కరణ.
ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ లు హాజరయ్యారు.
తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గడ్డ యాదయ్య అధ్యక్షతన మాదిగ డైరీ ఆవిష్కరణ మరియు నూతనంగా ఎన్నుకోబడిన మాదిగ సర్పంచులు ఉపసర్పంచులకు సన్మాన కార్యక్రమం రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన సర్పంచులకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సర్పంచులకు ఉండబడినటువంటి హక్కులు వినియోగించుకునే విధానాలు వచ్చే సమస్యలు వాటిపై వారికున్న అనుభవాలను నూతనంగా ఎన్నుకోబడిన మాదిగ సర్పంచులకు ఉప సర్పంచ్లకు వివరించి ధైర్యంగా ఉండి నీతి నిజాయితీ తోటి తన మన భేదం లేకుండా గ్రామల్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఒక్కరి సమస్యని తన సమస్యగా తీసుకొని పరిష్కరిస్తూ భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు పొందటానికి సిద్ధపడాలని మాదిగలు ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం కావాలని దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఈ సభ ముఖంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక కార్యదర్శి దేవుని సతీష్ మాదిగ, టి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఇటికె రాజు, తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం కార్యదర్శి హెచ్ఆర్ మోహన్, కవి గాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంగీత రాజలింగం, ప్రొఫెసర్ ఏక్ తిరుపతి, ఆరేపల్లి రాజేందర్, సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్యార శ్రీనివాస్, దారెపోగు ప్రమోద్ మహరాజ్ , లాయర్ మల్లన్న, తదితరులు పాల్గొన్నారు
