శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న బీసీవై పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న విజయవాడలో నిర్వహించనున్న బీసీల ‘సింహ గర్జన’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందంతో కలిసి హాజరై సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఐక్యంతో బహుజన రాజ్యాధికార సాధన కోసం ఈ ‘సింహ గర్జన’ పునాదిరాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో విజయవాడలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. తాను కూడా కార్యవర్గంతో కలిసి పాల్గొంటానని తెలిపారు. బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ..ఇరు రాష్ట్రాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సింహ గర్జనను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ ఓరుగంటి వెంకటేష్ యాదవ్, ఆర్గనైజర్ సెక్రటరీ హరి కృష్ణ చారి, ఉపాధ్యక్షులు ఈశ్వరన్న, ఆర్కే సాయన్న ముదిరాజ్, మేదరి మహేంద్ర సంఘం యువజన విభాగం అధ్యక్షులు సుమన్, గౌరవ సలహాదారులు పట్లూరి కృష్ణమోహన్, ఎర్రగుంట్ల వెంకటేష్ యాదవ్, సినిమా డైరెక్టర్ మురళి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శివకుమార్ యాదవ్, ఈశ్వరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.