అతివేగంతో ఆటోను ఢీ కొట్టిన బైక్.
ఆటోలో ఉన్న పలువురికి గాయాలు.
చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలింపు. - పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.
లోకల్ గైడ్/ తాండూర్:
అతివేగంతో ఓ బైకు ఆటోను ఢీకొట్టిన ఘటన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు, ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ గ్రామానికి చెందిన కురువ లక్ష్మప్ప తన అన్న కొడుకు వివాహం నిమిత్తం తాండూర్లోనీ ఓ షాపులో బట్టలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో, అందాజ రాత్రి 10 గంటల సమయంలో కందనెల్లి తాండ గ్రామ సమీపంలోని సుద్దా కంపెనీ దగ్గర మోటార్ సైకిల్ (బజాజ్ పల్సర్ నం. TS34A6128) డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంతో నడిపి ఆటో (టీఎస్ 34 టిబి 5080)ను డీ కొట్టినాడు.ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ , ప్రయాణికులకు గాయాలయ్యాయి.ఈ నేపథ్యంలో స్థానికులు గమనించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శంకర్ వెల్లడించారు.
